చైనా గొడవలు తేల్చేస్తాం..భారత్ కు మద్దతు ఇచ్చిన అమెరికా మంత్రి..!!

భారత వాస్తవా దీన రేఖ వద్ద చైనా దురాగతాల గురించి అందరికి తెలిసిందే.ప్రపంచం మొత్తం చైనా వైఖరిపై దుమ్మెత్తి పోస్తోంది, అయినా చైనా దూకుడు మాత్రం తగ్గనేలేదు.

 Us Secretary Of State Antony Blinken To Support India, India-china War, India, L-TeluguStop.com

భారత సైనికులను కవ్విస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది జిత్తుల మారి చైనా.భారత్ కూడా అందుకు ధీటుగా బదులు చెప్తున్నా ఈ సమయంలో భారత్ కు బలమైన దేశంగా, పెద్దన్నగా ఉన్న అమెరికా మద్దతు కావాల్సిందే.

గతంలో ట్రంప్ చైనా దూకుడు పై ఎన్నో విమర్శలు చేయడమే కాకుండా భారత్ కి పూర్తి మద్దతుగా నిలిచాడు.కానీ ఈ ఎన్నికల్లో బిడెన్ గెలిస్తే భారత్ కు మొండి చెయ్యి ఇస్తారని, చైనా కు అనుకూలంగా ఉంటారని, పాక్ కు కూడా బిడెన్ మంచి మిత్రుడని భావించారు అందరూ.కానీ

అమెరికా విదేశాంగ శాఖామంత్రి గా కీలక బాధ్యతలు చేపట్టనున్న ఆంటోని బ్లింకెన్ చైనా దిమ్మతిరిగిపోయేలా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండియాకు అనుకూలంగా చైనా కు గుబులు పుట్టేలా చేసిన ఈ వ్యాఖ్యలతో భారత ఎన్నారైలు, భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బ్లింకెన్ మాట్లాడుతూ భారత్, అమెరికాకు ఓ ఉమ్మడి సవాల్ ఉందని అది చైనా దేశమేనని వ్యాఖ్యానించారు.చైనా భారత్ వస్తవాదీన రేఖ వద్ద ప్రదర్శిస్తున్న దూకుడు తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కనబరుస్తున్న దూకుడును అడ్డుకోవాలని అందుకు భారత్ సహకారం పూర్తిగా కావాల్సి ఉందని ప్రకటించారు…దాంతో

భారత్ లోని లడాఖ్ వస్తావాదీన రేఖ వద్ద ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతల పై ప్రభావం చూపనుందని అంటున్నారు నిపుణులు.

బిడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే భారత్ తో పూర్తి స్థాయిలో చెలిమికి ప్రాధాన్యత ఇస్తారని, రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న భందాలను మరింత బలోపేతం చేస్తారని అన్నారు.భారత్ కు తాము ఎప్పుడు మిత్ర దేశమేనని ఎలాంటి కష్టం సంభవించినా భారత్ కు పూర్తి మద్దతు ఇస్తామని బ్లింకెన్ కుండ బద్దలు కొట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube