అదే నా దీర్ఘాయువు రహస్యం అంటున్న 111 ఏళ్ల వృద్ధుడు..!

నేటి సమాజంలో చాలా మంది ఆయుష్సు అంతంతమాత్రంగానే ఉంది.వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవిన విధానం వల్ల మనిషి జీవిత కాలం తగ్గుతూ వస్తోంది.

 Secret Behind This 111 Years Dexter Kruger From Australia, Viral, Viral Latest,-TeluguStop.com

చాలా మంది 70 ఏళ్లకు మించి ఉండడం లేదు.చాలా తక్కువ మంది మాత్రమే 80 ఏళ్లకు మించి బతుకుతున్నారు.

ఇక శతాధిక వృద్ధులు కోటికొకరు మాత్రమే కనిపిస్తారు.ఇటువంటి సమయంలో ఆస్ట్రేలియాలో ఓ వృద్ధుడు 111 ఏళ్లుగా జీవించడమే కాదు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఒక పశువుల ఫాం యజమాని అయిన డెక్స్‌టర్‌ క్రూగర్‌ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.సోమవారంతో ఆయనకు 111ఏళ్ల 124 రోజులు నిండాయి.

క్రూగర్‌ దీర్ఘాయువుకు కోడి మెదడే కారణమని తెలిపాడు.ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయం చెప్పాడు.

‘కోళ్లకు మెదడు ఉంటుంది కదా.వాటిలో చిన్నగా రుచికరమైనవి కొన్నుంటాయి.

వాటిని తినడం వల్ల నేను ఇన్నేళ్లు ఇంకా జీవిస్తున్నాను’ అని సెలవిచ్చాడు.ఇప్పటి వరకూ 114 ఏళ్ల 148 రోజులపాటు జీవించి 2002లో చనిపోయిన క్రిస్టినా కుక్‌ పేరు మీదే అత్యధిక కాలం జీవించిన రికార్డు ఉంది.”కోడికి తల ఉంటుందని మాత్రమే మనకు తెలుసు.అయితే ఆ తలలో మెదడు ఉంటుంది.

అది రుచికరంగా ఉండే చిన్న పదార్థం.చాలా తక్కువ పరిమాణంలోనే ఉంటుంది.” అని డెక్స్‌టర్ క్రుగర్​ తెలిపారు.తన జీవిత విశేషాలపై ఓ ఆత్మకథ కూడా రాశానని చెప్పుకొచ్చారు.

సాధారణ జీవనశైలే తండ్రి దీర్ఘాయువుకు కారణమని ఆయన చాలా సింపుల్‌గా ఉంటారని క్రుగర్ కుమారుడు గ్రెగ్ పేర్కొన్నారు.ఇప్పటికీ ఆయనకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉందని తెలిపారు.ఆస్ట్రేలియాలో ప్రస్తుతం అత్యధిక వయసున్న వ్యక్తి డెక్స్‌టర్ క్రుగర్ అని ఆస్ట్రేలియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకుడు జాన్ టేలర్ వెల్లడించారు.అత్యధిక ఏళ్లు జీవించిన వ్యక్తిగా ఈయన రికార్డుకెక్కాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube