సమంత ఆ రూపం వెనుక అసలు కథ ఏంటో తెలుసా?

టాలీవుడ్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత గురించి, తన నటన, అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో సమంతా కు ఉన్న క్రేజ్ మరెవ్వరికీ లేదనే చెప్పాలి.

 Secret Behind The Beauty Of Akkineni Samantha-TeluguStop.com

అది అందం విషయంలోనైనా, నటన విషయంలోనైనా.ఇదిలా ఉంటే సమంత తన పెళ్లి తర్వాత కూడా గ్లామర్ విషయంలో తగ్గేలాలేదు.

మరి ఇంత అందాన్ని కాపాడుకుంటూ వస్తున్నా సమంత అందం విషయంలో ఏకంగా ఓ పెద్ద రహస్యమే ఉందట.

 Secret Behind The Beauty Of Akkineni Samantha-సమంత ఆ రూపం వెనుక అసలు కథ ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమంత ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం సమంత శాకుంతలం అనే సినిమాలో బిజీగా ఉంది.ఇక అంతే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

బుల్లితెర యాడ్స్ లలో, షాపింగ్ మాల్స్ వస్త్రాల ప్రకటనల్లో, తెగ ఫోటో షూట్ లతో బిజీ బిజీగా ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా సమంత అందం వెనుక ఉన్న అసలు రహస్యం చెప్పింది.

తన అందానికి కారణం చందనం అంటూ మొత్తానికి చెప్పేసింది.

Telugu Akkineni Samantha, Anti Ageing, Chandanam, Instagram, Nagachaithanya, Samantha Beauty, Samantha Beauty Tips, Sandalwood, Star Heroine, Tollywood-Movie

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.తనకిష్టమైన గో టు నాచురల్ పదార్థం గురించి తెలిపింది.సహజ అందానికి తన ఫేవరెట్ గంధపు చెక్కట.

ఇందులో లో శాంతపరిచే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని, ఇవి చర్మానికి మంచిదని, ప్రతిరోజు చర్మ సంరక్షణకు గంధపు చెక్క అవసరమని తెలిపింది.గంధపుచెక్క చర్మానికి ముడతలు రాకుండా సహాయపడుతుందని, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం తో పోరాడుతుందని తెలిపింది.

అంతేకాకుండా పురాతన కాలం నుండి యాంటీ ఏజింగ్ రెమెడీగా ఉపయోగిస్తున్నారని తెలిపింది.

అంతేకాకుండా గంధపు చెక్కను వాడడానికి కొన్ని సులువైన మార్గాలు కూడా తెలిపింది.

చర్మం ప్రకాశవంతంగా కోసం రోజ్ వాటర్, గంధపు పొడి అవసరమని‌.ఈ పేస్టుని ముఖం, మెడ, చేతులకు పూసి ఆరిన తర్వాత కలగాలని తెలిపింది.

ప్రిక్లీ హీట్ నివారణకోసం ఎండిన కొత్తిమీర, గంధపు పొడిని రోజ్ వాటర్ లో కలుపుకుని దిమ్మల పై అప్లై చేసి కడగాలని తెలిపింది.దోసకాయ రసంతో గంధపు పొడి కలిపి చర్మానికి అప్లై చేసినట్లయితే జిడ్డు చర్మం తొలగిపోతుందట.

వన్ టేబుల్ స్పూన్ గంధపు పొడిని, బేసాన్ లేదా గ్రామ్ పిండి తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి కొంచెం రోజ్ వాటర్ తో పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాలు తర్వాత కడగాలి అంటూ నాచురల్ పద్ధతిలో కొన్ని టిప్స్ తెలిపింది సమంత.

#Nagachaithanya #Samantha Beauty #Instagram #SamanthaBeauty #Sandalwood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు