తెర ముందు పవన్ .. తెర వెనుక ఆ ఇద్దరు       2018-07-03   23:26:33  IST  Bhanu C

జనసేన రాజకీయంగా స్పీడ్ పెంచి వ్యూహాత్మకంగా అడుగులువేస్తోంది. పార్టీ నడపడం పవన్ కి చేతకావడంలేదని.. ఆయన రాజకీయ అజ్ఞాని అని ఇలా ఎన్ని ఆరోపణలు వస్తున్నా పవన్ మాత్రం ఎక్కడా కంగారు పడడంలేదు. పార్టీలో చేరికల విషయంలో కూడా ఆచితూచి వ్యహరిస్తూ పార్టీలో చేరేందుకు సిద్ధమని వస్తున్నవారందరిని కాకుండా కేవలం కొద్దిమందిని మాత్రమే ఎంపిక చేసుకుని పార్టీలో చేర్చుకుంటున్నాడు. బహుశా ఇదంతా గతంలో తన అన్న పెట్టిన ప్రజారాజ్యం పార్టీ విషయం లో ఎదురైనా ప్రతికూలతలు జనసేన విషయం లో కూడా ఎదురవకుండా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

-

ప్రజా సమస్యలు లేవనెత్తడంలో ఏంటి.. ప్రభుత్వ అవినీతి వ్యవహారాలేంటి అన్నిటిలోనూ తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నాడు. పవన్ చేపడుతున్న యాత్రలకు కూడా భారీ సంఖ్యలో జనాలు.. అభిమానులు హాజరవుతున్న పవన్ ఆశించిన స్థాయిలో మాత్రం మైలేజ్ రావడంలేదు. దీనికి కారణం పవన్ కి మీడియా సపోర్ట్ లేకపోవడమే. ఇప్పుడు పవన్ ని ఆలోచనలో పడేసింది కూడా ఇదే అంశం. దీనిపైనే పవన్ సీరిఔస్గా ఆలోచన చేస్తున్నాడట. ఈ సమయంలోనే పవన్ కి తెర వెనుక ఉండి సపోర్ట్ చేస్తున్న ఇద్దరు కీలక వ్యక్తుల గురించిన సమాచారం లీకయ్యింది.

మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కల్యాణ్ కు తాము మద్దతు ఇస్తామంటూ రాంచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వారి మద్దతు గురించి పవన్ స్పందించలేదు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ కు మెగా కంపౌడ్ నుంచి చిరంజీవి, అల్లు అరవింద్ ల మద్దతు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి – అల్లు అరవింద్ లో పవన్ కు తెరవెనుక మద్దతిస్తు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పవన్ ప్రచారానికి మీడియా అధినేతలతో చిరంజీవి, అల్లు అరవింద్ రహస్యంగా చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అదీ కాకుండా పవన్ సొంతంగా ఓ టీవీ ఛానెల్ ఏర్పాటుకోసం చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయంలో కూడా చిరు ,అరవింద్ తమ వంతు సహాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెరవెనుక పవన్ కు మద్దతు పలుకుతు , ఆర్ధికంగా సపోర్ట్ చేసే నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా ప్రముఖ ఛానళ్లలో వాటాలు కొనుగోలు చేసినట్లు.. వాటిద్వారా పవన్ పొలికల్ ఎజెండాను మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. పవన్ కు తెర వెనుక చిరు , అరవింద్ లు సపోర్ట్ చేయడం ఆహ్వానించదగిన అంశమే అయినా ప్రజారాజ్యం విషయంలో ఈ ఇద్దరు వేసిన తప్పటడుగులు మాత్రం ఇంకా ఎవరూ మర్చిపోలేదు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.