ఎంజీఆర్, జానకి పెళ్లి వెనుకున్న అసలు రహస్యం ఏంటో తెలుసా?

ఎంజీఆర్, జానకి.భార్య భర్తలు.ఎంజీఆర్ కు జానకి మూడో భార్య కాగా.జానకికి ఎంజీఆర్ రెండో భర్త.తమిళనాడు సీఎంగా కొనసాగుతూ ఎంజీఆర్ చనిపోయిన ఆ తర్వాత.మూడు వారాల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించింది జానకీ రామచంద్రన్.

 Secret Behind Mgr And Janaki Marriage, Mgr And Janaki Marriage, , Vn Janaki Real-TeluguStop.com

ఎంజీఆర్ 1987లో చనిపోగా.జానకి 1996లో చనిపోయింది.

నిజానికి జానకి అసలు పేరు వైక్కం నారాయ‌ణియ‌మ్మ జాన‌కి.కేర‌ళ‌లోని ఓ త‌మిళ నాయ‌ర్ కుటుంబంలో పుట్టింది.

Telugu Janaki, Mgr Janaki, Vn Janaki-Telugu Stop Exclusive Top Stories

జానకి తండ్రి సినీ గేయ రచయిత.అందుకే తనకు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే ఇష్టం ఉండేది.సినిమాల్లో నటించేందుకు మద్రాసుకు వచ్చింది.న‌వాబ్ రాజ‌మాణిక్యం అనే నాట‌క సంస్థ ఏర్పాటు చేసింది.అదే సమయంలో తనకు ఇవ్వ‌సాగ‌రం అనే సినిమాలో అవకకాశం వచ్చింది.అప్పటికి తన వయసు కేవలం 13 ఏండ్లు మాత్రమే.

అయితే సినిమా షూటింగ్ అయ్యాక సినిమా రీల్స్ అగ్నిప్రమాదంలో కాలిపోయాయి.తన తొలి సినిమానే ఇలా కావడం పట్ల ఆమె చాలా బాధపడింది.

ఆ తర్వాత కృష్ణ‌న్ తూడు అననే మరో సినిమాలో అవకాశం వచ్చింది.అదే సమయంలో ప్ర‌గ‌తి స్టూడియోలో మేక‌ప్‌మేన్‌గా చేస్తూ.

సపోర్టింగ్ రోల్స్ చేసిన గ‌ణ‌ప‌తిని ఆమె పెళ్లి చేసుకుంది.వారికి ఓ కొడుకు పుట్టినా.

సినిమాల్లో నటించింది.అనంతరం చాలా సినిమాల్లో చేసింది.

Telugu Janaki, Mgr Janaki, Vn Janaki-Telugu Stop Exclusive Top Stories

ఎంజీఆర్ తో కలిసి నటించిన మోహిని, మ‌రుద‌నాట్టు ఇళ‌వ‌ర‌సిస సినిమాలు సినీ రంగంలో తనను స్టార్ హీరోయిన్ లా ఎదిగేలా చేశాయి.అప్పటికే ఎంజీఆర్ మొద‌టి భార్య చ‌నిపోవ‌డంతో స‌దానంద‌వ‌తిని పెళ్లి చేసుకున్నాడు.ఆమె ఆరోగ్యం కూడా బాగుండేది కాదు.ఎంజీఆర్ తో సినిమాలు చేసే సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.అయితే తన రెండో భార్య చనిపోయిన తర్వాత ఎంజీఆర్ జానకిని పెళ్లి చేసుకున్నాడు.అప్పటికే జానకి తన మొదటి భర్తతో విడిపోయింది.

ఎంజీఆర్ తో పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యింది.అటు తమిళనాడు చరిత్రలో అతి తక్కువ కాలం సీఎంగా చేసిన వ్యక్తిగా జానకి కొత్త చరిత్ర లిఖించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube