రెండోసారి కరోనా బారిన పడ్డ ఆ రాష్ట్ర సీఎం..!!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు రోజుల వ్యవధిలోనే ఊహించని విధంగా బయటపడుతూ ఉండటంతో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

 Second Time Got Corona Positive Report-TeluguStop.com

కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలలో వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తూ రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నాయి.ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రంలో కూడా కరోనా కేసులు ఊహించని విధంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.

గత కొన్ని రోజుల నుండి 10 వేలకు పైగా కేసులు రోజు నమోదు కావడంతో .అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.ఈ క్రమంలో కరోనా కట్టడి చేయడం కోసం ఉదయం ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం ఎడ్యూరప్ప తాజాగా కరోనా బారిన పడ్డారు.సమావేశం అనంతరం కరోనా లక్షణాలు బయటపడటంతో బెంగళూరు లోని రామయ్య మెమోరియల్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యి .టెస్టులు నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.గతంలోనే యడ్యూరప్ప కరోనా బారిన పడ్డారు.

 Second Time Got Corona Positive Report-రెండోసారి కరోనా బారిన పడ్డ ఆ రాష్ట్ర సీఎం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత కోలుకుని మార్చి నెలలో వ్యాక్సిన్ కూడా వేయించుకోవటం జరిగింది.అయినా కానీ ఎడ్యూరప్ప మళ్లీ కరోనా బారిన పడటంతో ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

 ప్రస్తుతం రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

.

#Yedurppa #Karnataka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు