ఆర్ఆర్ఆర్ నుండి మరోటి.. ఈసారి ఏమిటో తెలుసా?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

 Second Song From Rrr To Release, Rrr, Ram Charan, Ntr, Alia Bhatt, Rajamouli, Tollywood News-TeluguStop.com

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

అయితే కేవలం హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్లు, ఓ థీమ్ సాంగ్‌ను మాత్రమే ఆర్ఆర్ఆర్ యూనిట్ రిలీజ్ చేయడంతో ఈ సినిమా నుండి మరో అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తు్న్నారు.వినాయక చవితి కానుకగా ఈ సినిమా నుండి ఏదైనా అప్‌డేట్ ఉంటుందని చాలా మంది ఆశించారు.

 Second Song From RRR To Release, RRR, Ram Charan, NTR, Alia Bhatt, Rajamouli, Tollywood News-ఆర్ఆర్ఆర్ నుండి మరోటి.. ఈసారి ఏమిటో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ వారందరినీ జక్కన్న అండ్ టీమ్ నిరాశకు గురిచేసింది.అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్‌డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆయనకు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది.

వీరిద్దరి మధ్య సాగే ఓ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తు్న్నట్లు తెలుస్తోంది.

వచ్చే వారం లేదా అటుపై వారంలో ఈ పాటను రిలీజ్ చేయాలని ఆర్ఆర్ఆర్ టీమ్ భావిస్తోందట.

ఒకవేళ ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, ఆయనకు జోడీగా ఒలివియా మారిస్ నటిస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, ఎంఎం కీరవాణి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.మరి ఆర్ఆర్ఆర్ నుండి రెండో పాటగా రాబోతున్న అప్‌డేట్ ఎప్పుడు ఉంటుందా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube