రెండో జాబితా విడుదల చేసిన టీటీడీపీ !     2018-11-14   22:56:13  IST  Sai M

తెలంగాణ టీడీపీ తన అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీటీడీపీ.. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి గణేష్ గుప్తా పేర్లను ప్రకటించింది. ఈ మేరకు టీటీడీపీ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ 75 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. టీటీడీపీ మొత్తంగా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీజేఎస్ కూడా 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక సీపీఐ తన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నామినేషన్ ల గడువు ముంచుకు వచ్చేస్తుండడంతో మహాకూటమిలోని పార్టీల సీట్ల ప్రకటన వేగం పుంజుకుంది.

Second List Released By TDP-

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.