ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలో మరో కథానాయిక.. సౌత్ భామపై ఆసక్తి  

Second Heroine Role Very Important in Prabhas New Movie, Nag Aswin, Deepika Padukune, Tollywood, Darling Prabhas - Telugu Darling Prabhas, Deepika Padukune, Nag Aswin, Second Heroine Role Very Important In Prabhas New Movie, Tollywood

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ లో ఉన్నాడు.ఈ సినిమా పూర్తయిన తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

 Second Heroine Role Very Important In Prabhas New Movie

సైన్స్ ఫిక్షన్ గా మూడో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో ఈ సినిమా కథనం ఉండబోతుంది అనే టాక్ వినిపిస్తుంది.పూర్తిగా విజువల్ వండర్ గా ఈ సినిమాని దర్శకుడు ఆవిష్కరించబోతున్నాడు.

భవిష్యత్తులోకి వెళ్లి ఈ సినిమా కథని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునేని ఇప్పటికే ఫైనల్ చేశారు.

ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలో మరో కథానాయిక.. సౌత్ భామపై ఆసక్తి-Movie-Telugu Tollywood Photo Image

ఇక ఆమెని ఎంపిక చేయడం ద్వారా సినిమాకి మరింత క్రేజ్ వచ్చింది.ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి మరోఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తుంది.ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా ఉందని తెలుస్తుంది.ఈ పాత్ర కోసం సౌత్ హీరోయిన్ ని తీసుకోవాలని దర్శకుడు నాగ్ అశ్విన్ చూస్తున్నట్లు సమాచారం.ఆమె పాత్రకి ఒక సాంగ్ కూడా ఉంటుందని, ఈ నేపధ్యంలో మంచి డాన్స్ టాలెంట్ ఉన్న హీరోయిన్ అయితే బెటర్ అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక సాయి పల్లవి పేరు అందులో ప్రముఖంగా వినిపిస్తుంది.అయితే పాత్ర ప్రాధాన్యత బట్టి సినిమాని ఎంపిక చేసుకునే సాయి పల్లవి ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.

ఇక ఇందులో విలన్ గా ఒక హాలీవుడ్ నటుడుని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.

#Nag Aswin #Darling Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Second Heroine Role Very Important In Prabhas New Movie Related Telugu News,Photos/Pics,Images..