అమెరికా: ఓ పక్క పెరుగుతోన్న నేరాలు.. సిబ్బంది కొరతతో సియాటెల్ పోలీస్ శాఖ ఇక్కట్లు

సియాటెల్ నగరంలో క్రైమ్ రేట్ 14 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది.అయితే పెరుగుతున్న నేరాలకు తగ్గట్టుగా సిబ్బంది నియామకాలు జరగకపోవడంతో నగర పోలీస్ శాఖ తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

 Seattle Police Department Struggling To Hire New Officers Amid Surging Crime, Se-TeluguStop.com

ఇది సమాజాన్ని రక్షించే అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది.సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్ గత వారం మాట్లాడుతూ.

ఈ ఏడాది 125 మంది కొత్త అధికారులను నియమించుకోవడానికి నిధులు వున్నాయని చెప్పారు.అధికారిక లెక్కల ప్రకారం.

జనవరిలో 20 మంది అధికారులు పోలీస్ శాఖ నుంచి నిష్క్రమించారు.

ఇదే సమయంలో గతేడాది 171 మంది అధికారులు, 2020లో 186 మంది అధికారులు సియాటెల్ పోలీస్ శాఖ నుంచి నిష్క్రమించారు.

సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం.హింసాత్మక నేరాలు గతేడాది 20 శాతం పెరిగాయి.24 శాతం తీవ్రమైన దాడులు, 18 శాతం దోపిడీలు పెరగ్గా.హత్యలు 25 శాతం, అత్యాచారాలు 6 శాతం తగ్గాయి.

గతేడాది ఇక్కడ 612 కాల్పుల ఘటనలు జరిగాయి.ఇది 2020తో పోల్చితే 40 శాతం, 2019 కంటే 86 శాతం పెరుగుదల.

అలాగే ఆస్తి సంబంధిత నేరాలు కూడా 9 శాతం పెరిగాయి.

అయితే సియాటెల్ మాజీ మేయర్ జెన్నీ డర్కాన్ గతేడాది జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.అధికారులకు 10 వేల నుంచి 25 వేల డాలర్ల నియామక బోనస్‌లను అనుమతించారు.అయితే ఆ నిధులు 2022లో అందుబాటులో వుండవని స్థానిక మీడియా తెలిపింది.

గతేడాది నవంబర్‌లో సియాటెల్ సిటీ కౌన్సిల్ బడ్జెట్ సవరణకు వ్యతిరేకంగా ఓటు వేసింది.దీంతో పోలీస్ శాఖ నుంచి మరో 101 మంది అధికారులను తొలగించాల్సి వచ్చింది.

సియాటెల్ తాత్కాలిక పోలీస్ చీఫ్ అడ్రియన్ డియాజ్ మాట్లాడుతూ.డిపార్ట్‌మెంట్‌కు ఎక్కువ మంది అధికారులు అవసరమన్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube