కూటమిలో లొల్లి ముదురుతోంది ! చీలిక తప్పదా ..?  

Seat Sharing Problems Plague Mahakutami-

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏకమైన విపక్షాల మహాకూటమి చీలిక దిశగా వెళ్తోంది. కూటమిలో ఉన్న పార్టీల మధ్య సీట్ల పంపకాలపై కాంగ్రెస్ నాన్చుడు ధోరణిపై భాగస్వామ్యపార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి. అధికార పక్షం ప్రచారంలో దూసుకుపోతుంటే..

కూటమిలో లొల్లి ముదురుతోంది ! చీలిక తప్పదా ..? -Seat Sharing Problems Plague Mahakutami

కాంగ్రెస్‌ ఇంకా సీట్ల లెక్కలు తేల్చకపోవడంపై… కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి తీవ్ర అసంతృప్తితో ఉంది. దీంతో సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌ డెడ్‌లైన్ విధించింది.

ఇవాళ సాయంత్రంలోగా తేల్చకపోతే సోమవారం పార్టీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటామని టీజెఎస్ హెచ్చరించింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకుండా ఉంది.

ఇక ఈ పొత్తులపైనా తెలంగాణ జనసమితి కోర్ కమిటీ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ దిలీప్, రచనారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

తొమ్మిది సీట్లకు ఎవరు అంగీకరించామన్నారని రచనా రెడ్డి నిలదీశారు. 16 సీట్లకు తక్కువ ఇస్తే కూటమిలో చేరాల్సిన అవసరం లేదన్నారు కోర్ కమిటీ సభ్యులు. ఈ నెల 24వ తేదీన పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడే దీనికి సంబంధించిన విషయాలపై సీరియస్ గా చర్చించడంతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చించబోతున్నారు..

జనసమితి పరిస్థితి ఈ విధంగా ఉంటే… మహాకూటమిలో ఉన్న మరో పార్టీ సీపీఐ కూడా కాంగ్రెస్ నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు సీట్లపై ఎటూ తేల్చడం లేదని ఆగ్రహంగా ఉన్నారనే చర్చ సాగుతోంది.

అయితే జనసమితిలో సాగుతున్న చర్చను గమనిస్తే కూటమిలో ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ జనసమితికి 16 సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని స్పష్టమవుతుందంటున్నారు నేతలు. ఒకట్రేండు రోజుల్లో కూటమి దారెటో తెలిసే అవకాశం ఉంది. కూటమిలో ఉన్న పార్టీలన్నీ తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాలంటే మేము ఎక్కడ నుంచి తేవాలి..

ఉమ్మడిగా ముందుకు వెల్దామనుకున్నప్పుడు చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోకుండా ఇలా పేచీ పెడితే ఎలా అంటూ కాంగ్రెస్ వాదిస్తోంది.