సీట్ల తెంపు తేలడం లేదా ..? కూటమిలో చిక్కులు తప్పవా ..?   Seat Adjustment Problem In Mahakutami In Telangana     2018-10-09   12:31:29  IST  Sai M

తెలంగాణాలో టీఆరఎస్ పార్టీ దూకుడుగా వెళ్తోంది… పార్టీ అభ్యర్థులను ప్రకటించడం దగ్గర నుంచి … అసమ్మతులను బుజ్జగించడం… ఎన్నికల ప్రచారం.. సభలు .. సమావేశాలు… ఇలా ప్రతి విషయంలోనే… కసిగా ముందుకు వెళ్తోంది. అయితే… ఈ విషయంలో మాత్రం ఇంకా వెనకబడే ఉన్నాయి కూటమిలోని పార్టీలు. ప్రచారం సంగతి దేవుడెరుగు ముందు కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఇంకా సీట్ల బేరం ఒక కొలిక్కి రాలేదు. ఆ విషయంపై ఒక స్పష్టమైన క్లారిటీ వస్తే కానీ ఎన్నికల ప్రచారంలో ముందుకు పోలేని పరిస్థితుల్లో మహా కూటమిలో ఉన్న పార్టీలు ఉన్నాయి.

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి రానివ్వకుండా ఉండడమే తమ ఉమ్మడి లక్ష్యం అని చెబుతున్న కూటమిలోని పార్టీలు సీట్ల దగ్గరకు వచ్చేసరికి కొన్ని పార్టీలు అడ్జస్ట్ అవుతుండగా కొన్ని మాత్రం ససేమీరా అంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై నెల రోజులుగా అనేకమార్లు చర్చలు జరిగినా ఓ నిర్ణయం మాత్రం తీసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేయాలనుకుంటుండం, టీజేఎస్, టీడీపీ, సీపీఐ ఎక్కువ స్థానాలు ఆశిస్తుండటంతో సీట్ల సర్దుబాటు చర్చకు ముగింపు పడటం లేదు.

Seat Adjustment Problem In Mahakutami Telangana-

కూటమిలోని అన్ని పార్టీల కన్నా బలంగా ఉన్న కాంగ్రెస్ ఖచ్చితంగా 90 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఇక టీడీపీ మొదట 25 స్థానాలు అడగినా.. చంద్రబాబు నాయుడు సూచనతో ఇప్పుడు 15 సీట్లు చాలు అంటున్నట్లు తెలుస్తోంది. ఇక 35 సీట్లతో చర్చలు మొదలుపెట్టిన తెలంగాణ జన సమితి ఇప్పుడు 25కి తగ్గింది. గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ ఈ ఎన్నికల్లో ఏకంగా 16 సీట్లు అడిగింది. 12కి తగ్గితే కుదరదు అని చెబుతోంది. అంటే, ఈ మూడు పార్టీలకు 52 స్థానాలు పోతే కాంగ్రెస్ కి మిగిలేది కేవలం 67 సీట్లు మాత్రమే. ఇందుకు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితిలో కనిపించడంలేదు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.