వందేళ్ల క్రితం మిస్‌ అయిన ట్రైన్‌.. ఇంకా వెదుకుతూనే ఉన్నారు   Searching About The Zanetti Train In 1911's     2018-07-12   03:53:34  IST  Raghu V

ఇండియాతో పాటు ప్రపంచంలో ఎక్కువ దేశాలు రవాణాకు ఉపయోగించేది రైలు మార్గం. మద్యతరగతి ప్రయాణికులకు వర ప్రదాయనిగా రైలును భావిస్తారు. ఇండియాలో రైలు ప్రయాణం చేసేవారి సంఖ్య రోజుకు లక్షల్లోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇండియాలో అత్యధిక పెద్ద సంస్థగా ఇండియన్‌ రైల్వేస్‌ పేరుంది. వందలాది రైల్లు, ఎక్కడెక్కడ ఎలాంటి సిగ్నల్స్‌ ఉంటాయి, అసలు ఆ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏంటీ అనేది సామాన్యులకు అర్థం కాదు. ఇక ఇలాటియన్‌ రైలు వంద ఏళ్ల క్రితం తప్పిపోయింది. ఆ రైలు ఎక్కడకు వెళ్లింది, అసలు దాంట్లో ఉన్న ప్రయాణికులు ఏమయ్యారు అనే విషయంపై క్లారిటీ లేకుండా ఉంది.

ఈ అరుదైన రైలు ప్రమాదం పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1911వ సంవత్సరంలో అప్పుడప్పుడే రైళ్ల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. అప్పట్లో ఇటాలియన్‌ ప్రయాణికులను రోమ్‌కు తీసుకు వెళ్లేందుకు ఒక రైలు ఉండేది. దాని పేరు జనెతి. ఈ రైలు వారంలో ఒక రోజు నడుస్తూ ఉండేది. ఈ రైలు ప్రయాణంలో పలు గుహలు, స్వరంగాలు దాటుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. 1911వ సంవత్సరంలో జనెతి రోమ్‌కు ప్రయాణం అయ్యింది. మొత్తం 106 ప్రయాణికులతో రైలు ప్రయాణం ప్రారంభం అయ్యింది.

రైలు ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా బోగీల్లో పొగ వ్యాపించింది. మొత్తం మూడు బోగీల్లో కూడా పొగలు వ్యాప్తి చెందడంతో పాటు అదే సమయంలో ఒక గుహ రావడం జరిగింది. బయట ఉన్న వ్యక్తులు ఎవరు కనిపించకపోవడంతో కొందరు దూకే ప్రయత్నం చేశారు. కొందరు అందులోనే ఉండి పోయారు. దూకిన వారిలో ఇద్దరు బతికి బట్టకట్టారు. మిగిలిన వారు ఏమయ్యారు, అసలు ఆ రైలు ఏమైందనే విషయంను ఇప్పటి వరకు ఏ ఒక్కరు కనిపెట్టలేక పోయారు. ఇటలి ప్రభుత్వంతో పాటు పలు విదేశీ సంస్థలు కూడా ఆ రైలు జాడను కనుక్కునేందుకు ప్రయత్నాలు చేశారు. కాని ఏ ఒక్కరు కూడా కనిపెట్టలేక పోయారు.

వంద సంవత్సరాలు దాటి పోయింది, టెక్నాలజీ ఎంతగానే అభివృద్ది చెందింది. అయినా కూడా మిస్‌ అయిన రైలును కనిపెట్టడంలో మాత్రం విఫలం అవుతున్నారు. గుహలో పట్టాలు తప్పి పక్కకు రైలు వెళ్లి పోయి ఉంటుంది, అదే సమయంలో ఆ గుహ మూసుకు పోయి ఉంటుందనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. గుహలోని పలు భాగాలను తవ్వి ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంకా కూడా రైలు కోసం వెదుకుతూనే ఉన్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.