గూగుల్‌లో ఇడియట్ అని సెర్చ్ చేస్తే.. ఎవరి ఫోటో వస్తుందో తెలుసా?   Search 'idiot' On Google, Get Trump     2018-07-23   09:49:55  IST  Sainath G

మనకి ఏ డౌట్ వచ్చినా గూగుల్ లో వెతుకుతాము. హెల్త్ నుండి టెక్నికల్ దాకా, స్టడీస్ నుండి మూవీస్ దాకా…ఇలా ఏ విషయమైనా మనం గూగుల్ లో తెలుసుకోవచ్చు. అయితే ఒకోసారి కొన్ని సెర్చ్ చేసినప్పుడు ఫన్నీ రిజల్ట్స్ చూపిస్తుంది గూగుల్. అదే దాని మీద జబర్దస్త్ లో ఎన్నో పంచెస్ కూడా వచ్చాయి. గూగుల్ లో గూట్లే అని వెతికితే ఫస్ట్ నీ పేరే వచ్చిందని ఎన్నో సార్లు పంచ్ లు వేశారు. మరి ఇప్పుడు నిజంగానే గూగుల్ లో ఇడియట్ అని వెతికితే ఎవరి పేరు వచ్చిందో తెలుసా.?

గూగుల్ సెర్చ్‌లో ఇడియట్ అని టైప్ చేసి… ఇమేజెస్ కోసం వెతికితే… భారీ సంఖ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలను చూపిస్తోంది. మానిటర్ మొత్తం ఆయన ఫొటోలతోనే నిండిపోతోంది.

అయితే గూగుల్ సెర్చింజిన్‌లో ఇడియట్ అంటూ వెతికితే అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ఫోటోలు రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ట్రంప్ వ్యతిరేకులే దీనికి కారణమని సీఎన్ఈటీ అభిప్రాయపడింది. ట్రంప్‌పై ద్వేషం ఉన్నవారు ట్రంప్ ఫొటోను అప్‌లోడ్ చేసి, ఇడియట్ అనే పదాన్ని దానికి జత చేస్తున్నారు. ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకులు ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ది గార్డియన్ పత్రిక తెలిపింది. ట్రంప్ పాలసీలు నచ్చని వారు ఈ క్యాంపెయిన్‌లో భాగస్వాములుగా ఉన్నారని సీఎన్‌ఈటీ(CNET) వెల్లడించింది