నాట్రాక్స్‌ (NATRAX) వద్ద అత్యంత వేగవంతమైన భారతీయునిగా టైటిల్‌ అందుకున్న సీన్‌ రోజర్స్‌

రాత్రిపూట దీపాలు ఆరిన తరువాత ప్రపంచం నిద్రపోతుంది.కానీ అతను మాత్రం విజయం సాధించాడు.

 Sean Rogers Bags Fastest Indian Title At Natrax 2-TeluguStop.com

సీన్‌ రోజర్స్‌ అధికారికంగా అత్యంత వేగవంతమైన భారతీయునిగా రికార్డు సృష్టించాడు.అతను ఎంత వేగంతో పయణించాడో తెలుసుకోవాలనుకుంటున్నారా ? గంటకు 329.83 కిలోమీటర్లు.

సీన్‌ రోజర్స్‌ గత 12 సంవత్సరాలుగా డ్రాగ్‌ రేసింగ్‌తో పాటుగా ఆటోక్రాస్‌ వేరియంట్లలో అనుభవజ్ఞుడైన రేసర్‌గా నిలిచాడు.

రేసింగ్‌ పట్ల తన అభిరుచిని మరో దశకు తీసుకువెళ్తూ తన పయణం సాగిస్తోన్న అతను 80కు పైగా అవార్డులు ఇప్పటికే అందుకున్నాడు.కార్లు, బైక్‌లంటే అమితాసక్తి చూపే సీన్‌ ఒక్కసారి ట్రాక్‌పైకి వెళ్లాడంటే తనకన్నా అనుభవజ్ఞుడైన రేసర్‌ అయినా వెనక్కి వెళ్లాల్సిందే ! కార్ల పట్ల అపారమైన జ్ఞానం కలిగిన సీన్‌కు అనుభవజ్ఞులైన రేసర్స్‌ అవినాష్‌ యెనిగళ్ల, సందీప్‌ నడింపల్లి వంటి వారి మద్దతు కూడా ఉంది.

నాట్రాక్స్‌ ట్రాక్‌ వద్ద తన ప్రదర్శన గురించి సీన్‌ మాట్లాడుతూ నా ఉత్సాహాన్ని నియంత్రణలో ఉంచుకుంటూనే, దానిని ట్రాక్‌పై చూపాను.రేస్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేము.

ట్రాక్‌ పై చురుగ్గా ఉండటం, ఇంజిన్‌ శబ్దం వింటూ దూసుకుపోవడం అంతే! అని అన్నారు.

ఇటీవలనే విజయం సాధించిన సీన్‌, వరుసగా మూడు విజయాలను ఇటీవల బెంగళూరు వ్రూమ్‌ డ్రాగ్‌ రేస్‌లో నమోదు చేశాడు.

ఫాస్టెస్ట్‌ డ్రైవర్‌ ఆఫ్‌ ద ఈవెంట్స్‌ ఇన్‌ ఆటోక్రాస్‌ మరియు ఫాస్టెస్ట్‌ ఇన్‌ ఫారిన్‌ కార్‌ అండ్‌ బైక్‌ డ్రాగ్‌ రేసెస్‌ వంటి ప్రతిష్టాత్మక టైటిల్స్‌ కూడా గెలుచుకున్నాడు.

అతని ప్లాన్స్‌ గురించి అడిగినప్పుడు సీన్‌ మాట్లాడుతూ తనలాంటి రేసర్లకు సైతం ఇదే తరహా విజయాలను నమోదు చేసే అవకాశం కల్పిస్తానన్నాడు.

సీన్‌తో పాటుగా అతని బృందాలు కూడా సమాంతరంగా పనిచేయడం ద్వారా ఈ విజయాలు నమోదు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube