చిప్స్ ప్యాకెట్ చోరి చేసిన సీగల్ పక్షీ.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న వీడియో..

సాధరణంగా జంతువులు, పక్షులు చేసే పనులు చూస్తుంటే నవ్వోస్తుంది.మనషుల మాదిరిగానే వాటికి ఆలోచించే పవర్ ఉందా అనుమనం కలుగుతుంటుంది.

 Seagull Bird Theft Chips Packet Funny Video Viral On Social Media ,viral Video,-TeluguStop.com

ఇక ఇంటర్నెట్‏లో వీటికి సంబంధించిన వీడియోలు బోలెడన్నీ కనిపిస్తున్నాయి.వీటి వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

తాజాగా మరో వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.కానీ ఇక్కడ ఈ పక్షి చేసిన పనికి ఆశ్చర్యంతోపాటు నవ్వు కూడా వస్తుంది.

సీగల్ (seagull) పక్షులు ఎక్కువగా సముద్రాలు, నదుల నీటిపైనే తిరుగుతుంటాయి.ఇక జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి కనిపించడం అరుదు.కానీ ఈ వీడియో మాత్రం ఓ సీగల్ పక్షి సూపర్ మార్కెట్‏కు వెళ్లింది.అక్కడ దానికి కావాల్సిన వాటిని తీసుకోని బయటకు వచ్చింది.

ఇక అంతే దానిని తీనేందుకు అది చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో హల్ చల్ చేస్తోంది.

స్కాట్లాండ్‌లోనిఅబెర్దీన్‌లో గల ఓ సూపర్ మార్కెట్‌ ముందుకు ఓ సీగల్ పక్షి వచ్చింది.ఆకలిగా ఉన్న ఆ పక్షీకి ఆ సూపర్ మార్కెట్లో ఉన్న పదార్థాలపై పడింది.అంతే వాటిని ఎలాగైనా తినాలనుకుంది.కానీ లోపలికి ఎలా వెళ్లాలో దానికి అర్థం కాలేదు.కాసేపు అక్కడే నిల్చోని చుట్టూ పరిక్షించింది.ఓ కస్టమర్ బయటకు వస్తున్నప్పుడు డోర్లు తెరచుకోవడాన్ని చూసింది.

అంతే ఆ కస్టమర్ బయటకు వెళ్లిపోగానే… డోర్లు మూసుకుపోయే లోపే… వేగంగా నడుస్తూ… సూపర్ మార్కెట్‌లోకి వెళ్లింది.అక్కడ ఉన్న చిప్స్ ప్యాకెట్లలో నుంచి ఒకటి తన నోట కరచుకోని వేగంగా బయటకు వచ్చేసింది.

ఇక దానిని ఓపెన్ చేసేందుకు ముక్కుతో పొడవడం ప్రారంభించింది.అది చేస్తున్న పనిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశాడు.

ఇది చూసిన నెటిజన్లు సూపర్, అదిరింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.మరీ ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube