బాబోయ్ ఇదేంటి.. కుక్కలా అరుస్తున్న సీగల్ పక్షి.. వీడియో వైరల్..!

సీగల్ పక్షులు.వీటి గురించి మన వాళ్లకు పెద్దగా తెలియక పోవచ్చు కానీ విదేశీయులకు బాగా తెలుసు.

 Seagull Barks Back After Man Makes Dog Noises, Seagull Bird, Viral Video, Seagul-TeluguStop.com

ఎందుకంటే మన దగ్గర పావురాలు ఎంత ఎక్కువుగా కనిపిస్తాయో విదేశాల్లో సీగల్ పక్షులు కూడా అంత ఎక్కువుగా కనిపిస్తాయి.చూడడానికి చాలా అందంగా ఉండే ఈ పక్షులు సముద్రంపై ఎక్కువుగా కనిపిస్తాయి.

సముద్రంలో దొరికే చిన్న చిన్న పురుగులను, చేపలను ఆహారంగా తింటూ బతుకుతాయి.

కానీ ఈ మధ్య ఈ సీగల్ పక్షులు విదేశీయులను భయపెట్టి మరి వారి చేతిలోని ఆహారం కొట్టేస్తూ షాక్ ఇస్తున్నాయి.బయట తింటూ కనిపిస్తే చాలు ఎక్కడి వస్తున్నాయో తెలియదు కానీ అలా వచ్చి ఇలా ఎత్తుకు పోతున్నాయి.

దీంతో విదేశీయులు ఈ సైగల్ పక్షులను చూస్తేనే బయపడి పోతున్నారు.ఇవి ఎదో ఒకటి చేయడం అవి వీడియోలు రుమాపం బయటకు వచ్చి వైరల్ అవుతూ నెటిజెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

తాజాగా ఈ సీగల్ పక్షి చేసిన పనికి నెటిజెన్స్ అంత ఆశ్చర్య పోతున్నారు.ఈ సీగల్ పక్షి కుక్కలాగా మొరగడం విని అంత షాక్ అవుతూ చూస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అలా ఎలా అరుస్తుందో యద్ధం కాక అందరు ఆశ్చర్య పోతూ చూస్తున్నారు.ఇవి ఎప్పుడు ఒకేలాగా అరుస్తూ ఉంటాయి.కానీ ఇప్పుడు ఒక పక్షి చేసిన పనికి అందరు షాక్ అవ్వుతున్నారు.

తాజాగా ఇంగ్లాండ్ లో ఒక అపార్ట్మెంట్ దగ్గర బాల్కనీ లోకి ఒక సీగల్ పక్షి వచ్చింది.అయితే ఈ అపార్ట్ మెంట్ దగ్గరకు ఇంతకు ముందు కూడా ఈ సీగల్ పక్షి చాలా సార్లు వచ్చింది.అది చుసిన అతడు దానిని వీడియో తీస్తూ బెదిరించాలని కుక్కలా మొరుగుతూ ఆక్ట్ చేసాడు ఆ తర్వాత సీగల్ కూడా అలానే కుక్కలాగా మొరగడంతో అతడు చాలా ఆశ్చర్య పోయాడు.మళ్ళీ మరొకసారి చేసిన ఆ తర్వాత అది కూడా అలానే చేస్తుంది.

ఈసారి కుక్కలాగా కాకుండా మరొక రకంగా అరవడంతో అది రాక సీగల్ పక్షి మామూలుగానే అరిచింది.దీంతో ఈ వీడియో అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది.

సీగల్ పక్షులు చాలా తెలివైనవని.వెంటనే పసిగట్టగలిగే తెలివి ఉందని ఈ వీడియో చూస్తేనే అర్ధం అవుతుంది.

మీరు కూడా చూసేయండి.

https://youtu.be/xBRlfXb1wZY

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube