మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి  

Sea Salt Body Scrub Benefits -

ప్రతి ఒక్కరు చర్మం మచ్చలు లేకుండా అందంగా ఉండాలని కోరుకుంటారు.దాని కోసం ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Sea Salt Body Scrub Benefits

రకరకాల కాస్మొటిక్స్ కూడా వాడుతూ ఉంటారు.కానీ ప్రయోజనం మాత్రం కాస్త తక్కువగానే ఉంటుంది.

ఇప్పుడు చెప్పే సముద్ర ఉప్పుతో ఆ సమస్య నుండి సమర్ధవంతంగా బయట పడవచ్చు.అది ఎలాగా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మచ్చలు లేని చర్మం కోసం… సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి-Telugu Health-Telugu Tollywood Photo Image

నాలుగు స్పూన్ల కొబ్బరినూనెలో రెండు స్పూన్ల సముద్ర ఉప్పును కలిపి స్క్రబ్ గా తయారుచేసుకోవాలి.ఈ స్క్రబ్ ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో మలినాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది.

మూడు స్పూన్ల నిమ్మరసంలో మూడు స్పూన్ల సముద్ర ఉప్పును కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా ఉండటమే కాకుండా మంచి రంగు కూడా వస్తుంది.

నాలుగు స్పూన్ల ఆలివ్ ఆయిల్ లో మూడు స్పూన్ల సముద్ర ఉప్పు,ఒక స్పూన్ ఓట్ మీల్ కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా నెలలో రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మం తేమగా ఉంటుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sea Salt Body Scrub Benefits- Related....