ఎన్ఠీఆర్ బయోపిక్ కి కొత్త చిక్కు..! ఆ పార్టీతో ఇప్పుడు కలవడం వల్ల స్క్రిప్ట్ చేంజ్..!     2018-11-15   11:29:11  IST  Sainath G

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చకచకా రూపొందుతోంది. ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు వస్తోన్న ఫస్టులుక్ పోస్టర్స్ అందరిలోను అంచనాలు పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన అంశాలతో ‘కథానాయకుడు’ .. రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన అంశాలతో ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు.పాజిటివ్‌గా దూసుకెళ్తున్న తరుణంలో ఎన్టీఆర్ బయోపిక్‌కు, బాలకృష్ణ ముందు రాజకీయ చిక్కులు వచ్చిపడ్డాయి. అదేంటో ఒక లుక్ వేసుకోండి.

Script Changes In Ntr Bio Pic-Ntr Pic. Tdp Alliance With Congress

ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి ముందు, చేపట్టిన తర్వాత ప్రధాని ఇందిరా, రాజీవ్ గాంధీలపైనే ఎనలేని పోరాటం చేశారు. ఇందిరా గాంధీని ఎదురించే నేత లేని సమయంలో ఆమెను ధీటుగా ఎదుర్కొన్నాడు. కాంగ్రెస్ పార్టీపై అప్పట్లో పోరాటం చేసి ఎదురు నిలిచింది అన్న గారు ఒక్కరే. ఎన్టీఆర్ చివరిశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీనే రాజకీయ శత్రువుగా భావించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్‌ను స్థాపించారు. కాంగ్రెసేతర పార్టీలన్నీంటిని ఒకే తాటిపైకి తెచ్చారు.

Script Changes In Ntr Bio Pic-Ntr Pic. Tdp Alliance With Congress

ఇప్పుడు ఎన్ఠీఆర్ బయోపిక్ లో రెండో భాగంలో రాజకీయ జీవితం గురించే ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీ పై అన్న గారి పోరాట సన్నివేశాలు చూపించాల్సి వస్తుంది. సినిమాకు ముందు రాసిన స్క్రిప్టు ప్రకారం కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దుయ్యబట్టే సన్నివేశాలను రాశారని, దాని ప్రకారమే కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్టు సమాచారం.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితులు ఎన్టీఆర్‌ బయోపిక్‌కు, బాలకృష్ణకు తలనొప్పిగా మారాయట. తెలంగాణలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌తో తెలుగు దేశం పార్టీ పొత్తు కుదుర్చుకోవడం ఈ సినిమాపై ప్రభావం చూపించేలా మారింది. స్క్రిప్టు ప్రకారం కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలను సంధిస్తే.. తెలుగు దేశం పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అందుకోసం స్క్రిప్ట్, డైలాగ్స్ లో మార్పులు చేస్తున్నారంట.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.