వింత ఆచారం: ఆ దేవుడుకు తేళ్లను నైవేద్యంగా పెడుతున్న భక్తులు!

దేవుడికి అయినా భక్తులు నైవేద్యం ఏం పెడుతారు? పాలు, పండ్లు, ఫలహారాలు సమర్పిస్తారు.మరికొందరు అయితే మాంసం తినే దేవుళ్ళకు మొక్కి మరి పొట్టేలు, కోడి వంటి నైవేద్యంగా పెడుతారు.

 Devotees Offeres Scorpions To God, Scorpions, Kurnool, Sri Kondala Rayudu Temple-TeluguStop.com

కానీ కుర్నూలులోని కోడుమూరులో కొండమీద వెలసిన శ్రీ కొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను నైవేద్యంగా పెడుతున్నారు.

అది కూడా ఎలానో తెలుసా? తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి తమ మొక్కులను తీర్చుకోవాలి.ప్రతి సంవత్సరం శ్రావణమాసం మూడో సోమవారం నాడు ఈ ఆచారాన్ని కోడుమూరు వాసులు పాటిస్తున్నారు.అయితే నిజానికి విషపురుగులైన తేళ్లను చూస్తే ఎవరైనా బయపడుతారు.కానీ అక్కడ ప్రతి ఒక్కరు చేత్తో పట్టుకొని దేవుడికి సమర్పిస్తారు.

Telugu Devotees God, Kondalarayudu, Kurnool, Srikondala-Latest News - Telugu

చేత్తో పట్టుకున్న సమయంలో తేళ్లు కుట్టాయి అంటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని లేదట.గుడి చుట్టూ మూడుసార్లు తిరిగితే చాలు నొప్పి మాయం అవుతుంది.సాధారణంగా అయితే శ్రీ కొండలరాయుడి దేవుడిని కోరుకునే కోరికలో తప్పు లేకుంటే తేళ్లు కుట్టవు అంట.అంతేకాదు స్వామివారిని తలుచుకొని పట్టుకున్న అవి కుట్టవు అని వారి నమ్మకం.అయితే అక్కడ దేవుడిని కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి అని ప్రతి యేటా భక్తులు పెరిగేవారు.

అయితే ఈ సంవత్సరమే కరోనా వైరస్ కారణంగా భక్తులు భారీ సంఖ్యలో తగ్గిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube