లీటర్ తేలు విషం అమ్మితే మీరే కోటీశ్వరులు... ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు!

మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేయవచ్చు.అయితే అది అంత తేలికైన విషయం కాదనుకోండి.

ఎందుకంటే తేళ్ల విషయానికి కొస్తే.ఇవి కూడా పాముల వలే విష జీవులు.

ఇందులో 2000 వరకు జాతులు ఉన్నాయని చెప్తారు.తేలు జీవన విధానం కూడా చాలా వింతగా ఉంటుంది.

ఏ వాతావరణంలోనైనా జీవించే తేలు సంవత్సరానికి ఒకసారి తింటే చాలట.ఇక అది సంవత్సరం పొడవునా ఆహారం లేకపోయినా బతికేస్తుంది.

Advertisement

అయితే ఈ తేలు యెక్క విషం ధర వింటే మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే.అవును, లీటర్ తేలు విషం 80 కోట్ల పైనే పలుకుతోందంటే మీరు నమ్ముతారా? ఒక చిన్న చుక్క కూడా ఇక్కడ ఎంతో విలువైంది.అందుకనే బేసిగ్గా టర్కీ ల్యాబ్‌లలో ఇటువంటి తేళ్లను విరివిగా పెంచుతున్నారు.

తేలు విషం నుండి అనేకరకాల మందులు తయారు చేస్తారు.తేలు విషానికి మనలోని కొన్ని వ్యాధులను నయం చేసే శక్తి ఉంది కాబట్టే వాటికి అంత డిమాండ్ అన్నమాట.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విషంగా చెబుతున్నారు.ఒక టర్కిష్ ప్రయోగశాల స్కార్పియన్స్ నుండి రోజుకు 2 గ్రాముల విషాన్ని మాత్రమే సేకరిస్తుంది.

ప్రత్యేక పద్ధతుల్లో ఈ విషాన్ని అక్కడ సేకరిస్తారు.ఆ తర్వాత విషాన్ని గడ్డ కట్టించి, పొడి చేసి విక్రయిస్తారు.తేలు జాతి యజమాని అయినటువంటి మెటిన్ ఓరిన్లర్ మాట్లాడుతూ.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

తేళ్ల నుంచి సేకరించిన విషాన్ని ముందుగా గడ్డ కట్టి, గడ్డకట్టిన విషాన్ని పౌడర్‌గా మార్చి అమ్ముతామని చెప్పుకొచ్చారు.ఈ తేలు యొక్క విషాన్ని యాంటీబయాటిక్స్, సౌందర్య సాధనాలు, నొప్పి నివారణల తయారీలో ఉపయోగిస్తారని అన్నారు.

Advertisement

ఒక తేలులో 2 మిల్లీగ్రాముల విషం వరకు ఉంటుంది.అంటే దాదాపు 300-400 తేళ్ల నుండి ఒక గ్రాము విషాన్ని మాత్రమే ఇక్కడ వారు సేకరించగలరు.

తాజా వార్తలు