తిట్టుకోవడంలోనూ రాజకీయం...ఇదే ఇప్పుడు క్వాలిఫికేషన్

వ్యక్తుల జీవితాల్లో.ఎవరిష్టం వారిది.

 Scolding Is The Qualification For The Political Leaders-TeluguStop.com

కానీ ఒకసారి వారు పబ్లిక్‌ ఫిగర్‌ అయిపోయిన తర్వాత.నా జీవితం నా ఇష్టం అనుకుంటే కుదరదు.

ఒకవ్యక్తి సొంతరెక్కల కష్టాన్ని నమ్మకుని బతుకుతూ… ఉన్నంతలో రోజులు వెళ్లదీసేస్తూ ఉంటే.అతడి జీవితంలో సాగే అరాచకత్వం గురించి ఎవ్వరూ ప్రశ్నించరు.

కానీ సమాజం మీదపడి బతుకుతూ… సమాజంలో ఆదరణ మాత్రమే తమ బతుకు తెరువుగా ఉండేవారు.ఆ సమాజానికి అంతేస్థాయిలో జవాబుదారీతనం వహించాలనడంలో తప్పేం ఉంది.

కొందరు నాయకులు ప్రస్తుతం అతిగా వ్యవహరిస్తున్నారు.ఎదుటివారి మీద బురద జల్లడమే వారి అర్హతగా పెట్టుకున్నారు.హుందాగా ఆ విమర్శలు ఉంటే పర్వాలేదు కానీ వ్యక్తుల పర్సనల్ విషయాల్లోకి వెళ్లి మరీ తమ విమర్శలకు పదును పెట్టడం నేటి రాజకీయాల్లో ఉన్న విలువలు గురించి తెలియజేస్తోంది.రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శల విషయంలో రెండు భేదాలు కనిపిస్తున్నాయి.

ఒక వ్యక్తిలోని బలహీనతల గురించి రెండోవాడు విమర్శిస్తాడు.నిజానికి అలా విమర్శించడం ఆ రెండోవాడి బలహీనతకు కూడా నిదర్శనమే.

రెండో వ్యక్తిలో సరిపడా ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల మాత్రమే… ఒకటో వ్యక్తి గురించిన వ్యక్తిగత జీవితంలోకి.వెళ్లి మరీ విమర్శించడం జరుగుతుంది.

ప్రస్తుత రాజకీయాలని ఆ పార్టీ నాయకులనే పరిగణలోకి తీసుకుంటే… జనసేన అధ్యక్షుడు పవన్ చేసిన సవాళ్ళను వైసీపీ అధినేత జగన్ స్వీకరించాడు.కానీ పవన్ మాత్రం ముందుకు రాలేదు.

సవాళ్లు విసరడమూ… వాటినుంచి ముందుగానే తాను పారిపోవడమూ ఒక అలవాటుగా మారిపోతున్న పవన్ వైఖరిపై విసుగు చెందిన జగన్ నేరుగా ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి మరీ విమర్శలు గుప్పించాడు.

జగన్‌ చేసిన విమర్శలు పవన్‌కు కొత్తకాదు.గతంలోనూ ఎంతోమంది ఎన్నోసార్లు ఆయనను అదే విమర్శలతో దెప్పిపొడిచారు.కానీ.

ఏకంగా తాను ప్రధానంగా తలపడుతున్న కీలక నాయకుడి నోటినుంచి అవేమాటలు వచ్చేసరికి.పవన్‌ వాటిని రాజకీయంగా వాడుకోవాలని అనుకున్నారు.

ఆ విమర్శలకు దీటుగా తన అభిమానులతో కౌంటర్ లు వేయించాడు.ఒక నాయకుడికి ఆదరణ పెరుగుతున్నదంటే.

దానికి ఏ రకంగా కత్తెర వేయాలా? అని కుట్రలు చేసే వ్యక్తులు రాజకీయాల్లో తరచూ కనిపిస్తూనే ఉంటారు.అధికారానికి చేరువకావడం ఒక్కటే అందరి లక్ష్యంగా ఉంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube