ఈ పిచ్చుక మామూలు పిచ్చుక కాదు...!  

పక్షులంటే అందరికి ఆసక్తి ఉంటుంది. పక్షులు చేసే శబ్దాలు… వాటి అందచందాలు చూసి ప్రతి ఒక్కరు ముచ్చట పడుతుంటారు. అయితే.. ఎప్పుడూ ఎవరికీ కనిపించని కొత్త జాతులు కనిపిస్తే ఇంకేమన్నా ఉందా .. సంబరపడిపోతారు కదా ! ఇప్పుడు ఓ కొత్త రకం పక్షి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. నలుపు- తెలుపు మిళితమైన గ్రే కలర్లో వుండే పిచ్చుకను పోలిన ఈ పక్షి.. వీపు, తల భాగం మాత్రం చిక్కటి పసుపుపచ్చ రంగులో మెరుస్తుంటుంది. ఇది మొట్టమొదటగా న్యూయార్క్‌లో పెన్సిల్వేనియాలో కనిపించిందట.

Scientists Who Discovered Rare Sparrow-

Scientists Who Discovered Rare Sparrow

‘ఇదొక మూడు విభిన్న జాతుల సంపర్కంతో పుట్టిన అరుదైన జాతి పక్షి’ అని నిర్ధారించింది పక్షిశాస్త్రానికి సంబంధించిన కార్నెల్ ల్యాబ్. దీన్ని మొదటగా చూసిన లోవెల్ బర్కెట్ అనే స్థానిక బర్డ్ వాచర్.. నీలం రెక్కల వార్బ్లర్, బంగారం రంగు రెక్కలుండే మరో వార్బ్లర్ లకు చెందిన ఉమ్మడి లక్షణాలు ఇందులో ఉన్నాయని, దీనికి అదనంగా చెస్ట్‌నట్ వార్బ్లర్ అనే మరో పక్షిలా పాడుతోందని పసిగట్టేశాడు. వెంటనే కార్నెల్ ల్యాబ్‌ని సంప్రదించాడు. ఈ పక్షి చేసే సౌండ్స్‌ రికార్డ్ చేసి వాళ్లకు మెయిల్ చేశాడు. అతడితో వెంటనే టచ్‌లోకొచ్చిన రీసెర్చర్లు.

ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కోసం ఆ పక్షి సైజుల్ని, రక్త నమూనాల్ని సేకరించారు. పరీక్షల అనంతరం బర్కెట్ చెప్పిన మాట నిజమేనని తేలింది. దీనికి బయలాజికల్‌గా ఆ రెండు వార్బ్లర్ పక్షులు తల్లులని, తండ్రి మాత్రం చెస్ట్‌నట్ వార్బ్లర్ అని.. డీఎన్ఏ ఫలితాలు తేల్చేశాయి. కొన్ని అరుదైన పరిస్థితుల్లో ఈ పేరెంట్ బర్డ్స్ పార్ట్నర్స్‌ని వెతుక్కుని.. వీటికి జన్మనిస్తాయని తెలుస్తోంది. కేవలం శీతాకాలంలో మాత్రమే కనిపించే ఈ అరుదైన పక్షి రకాల మీద ఆర్నిథాలజీ మరిన్ని పరిశోధనలకు నడుం బిగించింది.