వండర్‌ : రియల్‌ లైఫ్‌లో '24' సినిమా... శాస్త్రవేత్తలు విజయవంతంగా కాలంను వెనక్కు తిప్పారు  

  • కాలంను వెనక్కు తిప్పడం, కాలంలో ప్రయాణించి పూర్వ కాలంకు వెళ్లడం అనేవి ఇప్పటి వరకు మనం సినిమాల్లో చూశాం. అలా జరిగితే ఎంత బాగుండు అని ప్రతి ఒక్కరు అనుకుని ఉంటారు. బాలకృష్ణ ఆదిత్య 369 మరియు సూర్య నటించిన 24 చిత్రాలు కాలంలో ప్రయాణించే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమాలు ఆ దర్శకులకు ఎలా అలాంటి ఆలోచన వచ్చిందో ఏమో కాని చాలా కాలం నుండి శాస్త్రవేత్తలకు కూడా అలాంటి ఆలోచనే వచ్చి కాలంలో వెనక్కు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

  • తాజాగా మాస్కోకు చెందిన శాస్త్రవేత్తలు అద్బుతాన్ని ఆవిష్కరించారు. రాబోయే కాలంలో ఆదిత్య 369 మరియు 24 సినిమాల మాదిరిగా కాలంలో వెనక్కు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. తాజాగా వీరు చేసిన ప్రయోగంతో ఒక సెకనులో పదవ వంతు కాలం వెనక్కు వెళ్లారు. ఇది అతి తక్కువ సమయం కావచ్చు, దీని వల్ల ప్రస్తుతానికి ఎలాంటి ఉపయోగం లేకపోవచ్చు. కాని కాలంను వెనక్కు తిప్పగలిగే పద్దతి కనిపెట్టారు కనుక అది ఎక్కువ సమయంకు మార్చడం పెద్ద కష్టం ఏమీ కాదు. అయితే కాలంలో వెనక్కు వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది మాత్రం తెలియదు.

  • Scientists Use A Quantum Computer To Reverse Time-Moscow Institute Of Physics Quantum Reverse Time

    Scientists Use A Quantum Computer To Reverse Time

  • సినిమాలో మాదిరిగా జనాలు కూడా ఆ కాలంకు వెళ్లి పోతారా, చనిపోయిన వారు లేచి వస్తారా ఇలాంటి అనుమానాలు మొదలవుతున్నాయి. అయితే కాలం వెనక్కు తిప్పడం సాధ్యం అయ్యే విషయమే కాని చనిపోయిన వారు తిరిగి రావడం, ఆ కాలం పరిస్థితులు మళ్లీ పునరావృతం అవ్వడం అయ్యే పని కాదని నిపుణులు అంటున్నారు. అలాంటప్పుడు కాలం వెనక్కు తిరిగితే ఏంటీ, ఇక్కడే ఉంటే ఏంటీ అని మీరు అనుకోవచ్చు. కాని ప్రతి దాని వెనుక చాలా ఉద్దేశ్యం ఉంటుంది. శాస్త్రవేత్తలు చాలా పెద్ద ప్రయోగాలు చేసి ఇలాంటి కాలం వెనక్కు తిప్పే పరిశోదన చేశారు అంటే వారు ఏదో ఆశించి చేస్తున్నారు. అది ఏంటీ అనేది వారే చెబుతారు.

  • Scientists Use A Quantum Computer To Reverse Time-Moscow Institute Of Physics Quantum Reverse Time
  • ఏది ఏమైనా భవిష్యత్తులో ఏదైనా సాధ్యం అయ్యేలా ఉంది. అప్పటి వరకు మనం ఉంటామో లేదో తెలియదు కాని రాబోయే వంద ఏళ్లలో మరిన్ని అద్బుతాలు ఆవిష్కారం అవ్వడం ఖాయం. ఒక వేళ వంద ఏళ్ల తర్వాత మన భవిష్యత్తు తరాల వారు కాలంలో నిజంగానే ట్రావెల్‌ చేసే ప్రయోగాలు పూర్తి చేసి మనను కలుస్తారేమో ఎవరికి ఎరుక

  • కాలంలో ప్రయాణించే ప్రయోగంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌ రూపంలో తెలియజేయండి.