ఏ మాస్క్ వేసుకుంటే కరోనా రాదో మీకు తెలుసా?

కరోనా వైరస్ ప్రపంచ ప్రజలను చిగురుటాకులా వణికించేస్తోంది.అలాంటి వైరస్ బారి నుంచి బయటపడాలంటే మనం మాస్కు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ తప్పకుండ పాటించాలి.

 Scientists Tested,14 Types Of Masks, Corona Virus, Covid-19, N95 Mask-TeluguStop.com

ఇంకా ఇప్పటికే ఏ శానిటైజర్ వాడాలి? ఎన్ని మీటర్లు సోషల్ డిస్టెన్స్ ఉండాలి అనేది తెర మీదకు వచ్చింది.అయితే ఇప్పుడు ఏ మాస్కు ఉపయోగిస్తే కరోనా రాదు అనేదానిపై పరిశోధకులు పరిశోధన చేసారు.

వారి పరిశోధన ప్రకారం అన్ని మాస్కులను కట్టడి చెయ్యాలని ఆదేశిస్తున్నారు.ఎందుకంటే? అమెరికా డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మాస్క్ లపై పరిశోధన జరిపారు.ఆ పరిశోధనలో భాగంగా లేజర్ సెన్సర్ డివైజ్ తో 14 రకాల మాస్క్ లను, ఫేస్ కవరింగ్స్ ను పోల్చి చూశారు.ఏ మాస్కు ధరించినప్పుడు మాట్లాడినా, తుమ్మినా, దగ్గినా ఏ దశలో పయనించాయి అనేది దగ్గరగా చూశారు.

వారి పరిశీలనలో ‘వైరస్’ను అరికట్టడంలో ఎన్ – 95 మాస్క్ లు మంచివి అని తెలిపారు.అయితే ఎన్ – 95 మాస్క్ లు కూడా వాల్వ్ లేకుండా ఉపయోగించాలని సూచించారు.

ఎన్ – 95 మాస్క్ తో పాటు త్రీ లేయర్ మాస్క్, కాటన్ పొలిప్రోలిన్ కాటన్ మాస్క్, టూ లేయర్ పొలిప్రోలిన్ ఏ ప్రాన్ మాస్క్ లు కూడా మంచివే అని సూచించారు.కాగా వాల్వ్ లేని మాస్కులనే ఉపయోగించాలి అని పరిశోధకులు పదే పదే హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube