ఎలుకలు ఆ విషయంలో సక్సెస్ అయ్యాయి... మనుషులు కూడా ఇక నవ యవ్వనంగా?

పోయే కాలం, తరిగే అందం తిరిగి రావని తెలిసినా నేటి మానవుడు రాని దానికోసం ఆరాటపడుతూనే ఉంటాడు.ఈ క్రమంలో పోయిన యవ్వనం తిరిగి పొందాలనే దృష్టితో అనేక ప్రయోగాలు చేస్తున్నాడు.

 Scientists Reverse Ageing On Mice Can Same Will Apply For Humans Details, Humans-TeluguStop.com

అయితే ఇందులో ఎంతమేరకు విజయం సాధిస్తారో తెలియదు గాని, మనం పోగొట్టుకున్న వయసు మళ్ళీ వెనక్కు తెచ్చుకోవచ్చని అంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు.అవును, వృద్ధాప్యాన్ని ఆపడానికి శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తున్నారు.

వయసు పెరిగే కొద్దీ శరీరంలోని DNAలో జరిగే మార్పుల వల్ల వయసు పెరుగుతుంది, వృద్ధాప్యం వస్తుందనే విషయం చదువుకున్న ప్రతిఒక్కరికీ తెలిసినదే.

Telugu Harvardmedical, Humans, Rates, Research Rats, Reverse, Youthfulness-Lates

అయితే ఈ DNAలో మార్పులు చేయడం వలన వయసు పెరగడాన్ని అరికట్టవచ్చట.దీన్నే ఎపిజెనెటిక్స్ అంటారు.ఈ ప్రక్రియలో ఏం చేస్తారంటే, మారే DNAలో కృత్రిమంగా కొన్ని మార్పులు చేస్తే రివర్స్ ఏజింగ్ అవుతుంది.

ఇక ఈ ప్రయోగాన్ని నేరుగా మనుసులమీద చేయరు కదా.తాజాగా ఎలుకల మీద ప్రయోగాలు చేశారు హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు.అది సక్సెస్ అయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ వివరాలను జర్నల్ సెల్ లో పబ్లిష్ చేయడం విశేషం.

Telugu Harvardmedical, Humans, Rates, Research Rats, Reverse, Youthfulness-Lates

ఈ అధ్యయనంలో భాగంగా హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు సరట్వైన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది.సరట్వైన్స్ అంటే ఏమంటే, మానవ శరీరంలో జీవక్రియలను క్రమబద్ధీకరించే సిగ్నలింగ్ ప్రొటీన్లనే సరట్వైన్స్ అంటారు.దీనివల్ల ఎలుకల్లో 50 శాతానికి పైగా రివర్స్ ఏజింగ్ జరిగింది బల్లగుద్ది మరీ చెబుతున్నారు శాస్త్రవేత్తలు.ఈ ప్రయోగంలో ఎలకల కంటి నరాలు యవ్వనంగా అయ్యాయని అంటున్నారు.

దానివల్ల వాటి చూపు కూడా బాగా మెరుగుపడటమే కాకుండా కండరాలు, మెదడు, కిడ్నీల్లో కూడా కొత్త కణాలు ఆవిర్భవించాయి.తర్వాత ఆ ఎలుకలకు జీన్ థెరపీ చేసిన తరువాత కూడా అవి మునపటిలా యవ్వనాన్ని సంతరించుకున్నాయట.

ఈ పరిశోధనలను బట్టి మనుషులకు కూడా రివర్స్ ఏజింగ్ వస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube