ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? మర్చిపోలేదు కదా? ఏడు ఉన్నాయి.అవే ఆసియా, అన్టార్టికా, ఆస్ట్రేలియా, అఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా.
లెక్క సెట్ అయినట్టేనా? కాలేదు అంటున్నారు న్యూజిలాండ్ పరిశోధకులు.వారికి ఎనిమిదో ఖండం జాడ దొరికింది అంట.
పాసిఫిక్ మహాసముద్రంలో ఇప్పటివరకు కనబడని ఖండం ఉందట.ఒక ఖండానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్న ఇది 4.9 మిలియన్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉందని, 94% నీరు కలిగి ఉన్న ఈ ఖండాన్ని అతిచిన్న ఖండంగా, మొత్తం మీద ఎనిమిదో ఖండంగా గుర్తించాలని ఆ పరిశోధకుల బృందం అంటోంది.అప్పుడే ఈ బుల్లి ఖండానికి “జీలాండియా” అనే పేరు కూడా పెట్టేసారు వారు.
వీరి పరిశోధనల్ని జియోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా ప్రచూరించింది.మరి ఈ 11 భూగోళ పరిశోధకులు పెట్టిన శ్రమకి తగిన ఫలితం దక్కి, జిలాండియా ఎనిమిదో ఖండం అనే గుర్తింపుని సాధిస్తుందా లేదా చూడాలి.