స‌రికొత్త జాతి డైనోస‌ర్‌ను క‌నిపెట్టిన సైంటిస్టులు.. ఇది మ‌హా డేంజ‌ర్‌

మ‌నం కండ్ల‌తో రియ‌ల్ గా చూడ‌క‌పోయినా కూడా మ‌నంద‌రికీ బాగా ప‌రిచ‌యం ఉన్న పేరు, అలాగే అత్యంత భ‌యాన‌క‌రమైన పేరు డైనోసార్‌.మాన‌వులు పుట్ట‌క ముందు కొన్ని వేళ ఏండ్ల క్రితం ఈ భూమ్మీద డైనోసార్లు జీవించాయ‌న్న‌ది అంద‌ర‌కీ తెలిసిందే.

 Scientists Have Discovered A New Species Of Dinosaur, The Great Danger. Dinosaur-TeluguStop.com

ఇక ఈ భారీ జంతువు నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఎన్నో క‌థ‌నాలు, ప్ర‌యోగాలు జ‌రుగుతూనే ఉన్నాయి.సైంటిస్టులు కూడా వాటి మీద ఇప్ప‌టికీ చాలా ర‌కాల ప్ర‌యోగాలు  జ‌రుపుతూ వాటి జీవ‌న విధానాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక విష‌యం చెబుతూనే ఉన్నారు.

వీటి మీద పిక్షన్ సినిమాలు ఎన్నో రూపొందాయి.

కాగా ఇప్పుడు ఈ డైనోసార్ల గురించి ఓ వార్త తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

దీని గురించి తెలిస్తే ఒకింత భ‌యం గానే ఉంటుంది.తాజాగా ఓ కొత్త జాతి డైనోసార్ ను గుర్తించారు సైంటిస్టులు.

ఈ జాతి డైనోసార్‌ను దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలో గుర్తించారు సైంటిస్టులు.ఈ డైనోసార్ ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించిన వాటికంటే చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని చెబుతున్నారు.

దీని బాడీ మీద గట్టి కవచం ఉంటుంద‌ని, అలాగే తోక పదునైన ఆయుధంలా ప‌నిచేస్తుంద‌ని సైంటిస్టులు వెల్ల‌డించారు.చీలి దేశంలో దొరికిన శిలాజాల ఆధారంగా శాస్త్ర‌వేత్త‌లు దీని రూపాన్ని గీశారు.

Telugu America, Chili, Dinosaur, Ratical Snkae-Latest News - Telugu

దాదాపు రెండు మీటర్ల వ‌ర‌కు ఈ డైనోసార్ పొడవు ఉంటుంద‌ని, ఇది 74.9 మిలియన్ల ఏండ్ల కింద జీవించి ఉంటుంద‌ని భావిస్తున్నారు.ఆంకిలోసారస్ లాటి డైనోసార్ల లాగానే దీనికి తల ఉంటుంద‌ని, అయితే దీని శరీరం, తోక చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ని వివ‌రిస్తున్నారు.ఈ శిలాజాల‌ను 2018లోనే గుర్తించినా కూడా దాన్ని మీద ఇన్ని రోజులు ప‌రిశోధ‌న‌లు జ‌రిపి దానికి సంబంధించిన వివ‌రాల మీద ఓ క్లారిటీకి వ‌చ్చారు.

దీని తోక రాటిల్ స్నేక్ తోక ను పోలిన‌ట్టు ఉంటుంద‌ని, అత్యంత బ‌లిష్టంగా, ప‌దునుగా ఉంటుంద‌ని వివ‌రిస్తున్నారు సైంటిస్టులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube