చంద్రుడిపైన మొక్కలు పెరిగే అవకాశం వుంది.. ఇదిగో ఉదాహరణ!

గత కొన్ని వందల సంవత్సరాలుగా మనిషి చంద్రుడిపైన జీవించటానికి ట్రై చేస్తూ వున్నాడు.కానీ వర్కవుట్ కావడం లేదు.

 Scientists Grow Plants In Lunar Soil Regolith Details, Moon, Sand, Plants, Palnt-TeluguStop.com

ఎందుకంటే అక్కడ జీవించే అవకాశం లేదు కనుక.ఈ క్రమంలో మొదట అక్కడ నీటి జాడ ఉందేమో అని టెస్ట్ చేయగా లేదని తెలిసింది.

మట్టిని పరీక్షించారు.అది కూడా మనిషి జీవించడానికి అవునుగా లేదని తేల్చి చెప్పారు.

అయితే రానురాను శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను ఇంకా పెంచారు.ఈ క్రమంలో అధునూతన పద్ధతిలో పరీక్షలు జరిగి, మొదట నీటి జాడలేనివారు అక్కడ ఏవేవో నీటి ఊటల జాడలు కనుక్కున్నారు.

తరువాత ఇపుడు తాజాగా అక్కడి నేల మొక్కలు పెరగడానికి అనువుగా లేదని చెప్పిన వారు ఇపుడు ఆ నెలలో మొక్కలు బతుకుతాయని చెబుతున్నారు.

తాజాగా చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కలు పెంపకం చేసి విజయం సాధించారు మన శాస్త్రవేత్తలు.

భూమి వెలుపల ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవాలన్న మానవుడి కోరిక తీరుతుందో లేదో ఆ పరమేశుడికెరుకగాని, తాజాగా జరిగిన ఈ విషయంతో కొంతమంది శాస్త్రవేత్తలు కాస్త ఊరట చెందారు.అమెరికా ప్రయోగించిన అపోలో మిషన్ లో భాగంగా చంద్రుడిపైకి అడుగుపెట్టిన అప్పటి శాస్త్రవేత్తలు ఈ ‘రెగోళిత్’ను (మట్టి) భూమికి తీసుకువచ్చారు.

దాదాపు శతాబ్దం పాటుగా ‘రెగోళిత్’ సారంపై పరీక్షలు జరిపిన శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా, పోషకాలు లేని చంద్ర రెగోలిత్‌లో పరిశోధకులు ఎంతో కష్టంతో కూడిన అధ్యయనం చేసి ‘అరబిడోప్సిస్ థాలియానా’ అనే మొక్కను పెంచారు.

Telugu Apollo, Grow Lunar Soil, Moon, Moon Soil, Nasa, Regolith, Sand, Latest-La

భవిష్యత్తులో అంతరిక్షంలో నివసించే వారికోసం లేదా విశ్వంలో పనిచేసే వ్యోమగాములు కోసం ఆహార వనరులను అభివృద్ధి చేయడానికి ఈరకంగా ఇతర గ్రహాలపై ఉన్న వనరులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.వ్యవసాయ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి నాసా ఎలా పనిచేస్తుందో కూడా ఈ ప్రాథమిక మొక్కల పెరుగుదల పరిశోధన ఒక ముఖ్య ఉదాహరణగా చెప్పుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.భూమిపై ఆహార కొరత ఉన్న ప్రాంతాల్లో మొక్కలు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎలా అధిగమించవచ్చో అర్థం చేసుకోవడంలో విశ్లేషించుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube