అక్కడ గబ్బిలాల కోసం వేట.. ఎందుకో తెలుసా?

గబ్బిలం ఈ పేరు వినగానే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది.ఈ పేరు వినగానే అందరికీ కరోనా వైరస్ గుర్తొస్తుంది.

 Scientists Focus On Bats To Control Next Pandemic, Corona Virus, Bats, China, Ch-TeluguStop.com

ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించిన కరోనా మహమ్మారి గబ్బిలాల వల్ల వ్యాపించిందని జోరుగా ప్రచారం సాగింది.అయితే కరోనా వైరస్ దేనివల్ల వ్యాపించింది అనే విషయంపై ఇప్పటికీ సరైన ఆధారాలు లేవు.

కరోనా వైరస్ వ్యాపించడానికి సరైన కారణం ఏమిటని తెలుసుకునే విషయంలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.అయితే ఇప్పటివరకు కరోనా వైరస్ దేనివల్ల వ్యాప్తి చెందింది అనే విషయం గురించి శాస్త్రవేత్తలు తెలియజేయలేదు.

తాజాగా ఫియోక్రూజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు మాత్రం గబ్బిలాలను పట్టుకొని, వాటిపై మరికొన్ని కొత్త అధ్యయనాలు చేస్తున్నారు.“గబ్బిలాలను పట్టుకోండి… మరో ప్రపంచ మహమ్మారిని నివారించటంలో సహాయపడుతుంది” అంటూ ఓ ప్రత్యేకమైన మిషన్ ను శాస్త్రవేత్తలు చేపట్టారు.ఈ అధ్యయనంలో భాగంగా అక్కడి శాస్త్రవేత్తలు గబ్బిలాల వేటలో నిమగ్నమయ్యారు.గబ్బిలాల కారణంగా మరో ప్రమాదకరమైన వైరస్ ప్రపంచంలో వ్యాపించకుండా వాటిని నివారించేందుకు ముందుగానే శాస్త్రవేత్తలు గబ్బిలాలను పట్టుకొని వాటిపై అనేక పరిశోధనలు చేపడుతున్నారు.

Telugu Bats, China, Chinese, Corona, Pandemic, Batscontrol-Latest News - Telugu

అయితే ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్న కరోనా వైరస్ రావడానికి కారణమైన చైనా దేశస్తులు గబ్బిలాలను తినడం వల్ల వాటి నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించిందని జోరుగా ప్రచారం సాగింది.అంతేకాకుండా కావాలనే చైనా దేశం ఇలాంటి భయంకరమైన వైరస్ ను సృష్టించిందని వార్తలు కూడా రావడంతో అన్ని దేశాలు ఒక్కసారిగా డ్రాగన్ కంట్రీ పై విరుచుకుపడ్డాయి.అంతే కాకుండా మరికొన్ని దేశాలు చైనా తో ఉన్న లావాదేవీలను సైతం నిలుపుకున్నారు.

Telugu Bats, China, Chinese, Corona, Pandemic, Batscontrol-Latest News - Telugu

ఏది ఏమైనా ఈ కరోనా మహమ్మారి వంటి మరొక భయంకరమైన వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెంది ప్రపంచం మొత్తం అతలాకుతలం కాకుండా ఉండేందుకు ముందుగానే గబ్బిలాలను పట్టుకుని వాటి పై శాస్త్రవేత్తలు తీవ్రమైన పరిశోధనలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube