కరోనా పై సంచలన విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు

ప్రపంచ దేశాలను వణికించేస్తున్న కరోనా వైరస్ పై చైనీస్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలను వెల్లడించారు.చైనీస్ సెంటర్ ఫార్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక డేటాను విడుదల చేయగా దానిలో కొన్ని నమ్మలేని విషయాలను వెల్లడించారు.ఇప్పటివరకు కరోనా బారిన పడిన సుమారు 44,672 మందిని శాస్త్రవేత్తలు పరిశీలించగా వారిలో 51.4% పురుషులు,48.6% మంది స్త్రీలు ఉన్నట్లు వెల్లడించారు.అయితే కరోనా బారిన పది మరణించిన వారిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తలు విడుదల చేసిన జాబితా లో వెల్లడించారు.
కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యలో 63.8% పురుషులు, 36.2% స్త్రీలు ఉన్నట్టు డేటాలో పేర్కొన్నారు.100లో 81 మందికి కరోనా తీవ్రత సాధారణంగానే ఉంటుందని, అలానే 14 మందికి మధ్యస్తంగా.కేవలం ఐదుగురు మాత్రం తీవ్రంగా అనారోగ్యానికి గురవుతారని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.ఇప్పటివరకు చూసుకుంటే వైరస్ బారినపడిన 100 మందిలో 87 మంది పూర్తిగా కోలుకున్నారని అయితే 4% శాతం మంది మాత్రం ప్రాణాలు కోల్పోతున్నట్లు వివరించారు.

 Scientists Facts Corona Death Rate Male-TeluguStop.com

Telugu Corona Male, Corona, Male-

అలానే ఈ కరోనా అనేది 70ఏళ్లు పైబడిన వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.అలానే గుండె సంబంధిత, డయాబెటీస్, క్రోనిక్ రెస్పిరేటరీ డిసీస్, క్యాన్సర్, హై బీపీ వంటి ఆరోగ్య సమస్యలున్నవారు ఈ వైరస్ బారినపడితే వారి ప్రాణాలకు మరింత ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube