బ్రెజిల్ ని వణికిస్తున్న యారా... మరో కొత్తరకమైన వైరస్  

Scientists Discover Mysterious Virus In Brazil-corona Virus,covid-19,mysterious Virus In Brazil,scientists Discover

మనవ వినాశనం ఎలా జరుగుతుందో అని అందరూ ఆలోచించే సమయంలో కచ్చితంగా బయోవార్ ద్వారా ఉండే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావించారు.ఒక్కో యుగం ఒక్కో విధంగా నాశనం అయినట్లు ఈ కలియుగాంతం మనిషి తన విపరీత పోకడలతో సృష్టిస్తున్న వైరస్ ల కారణంగా జరగబోతుందని ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ గురించి ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది.

Scientists Discover Mysterious Virus In Brazil-Corona Covid-19 Mysterious Brazil

చైనాలో విపరీతంగా వ్యాపించేస్తున్న ఈ వైరస్ ముప్పు ప్రపంచంలో సైగానికి పైగా జనాభాకి ఉందని ఇప్పటికే డాక్టర్లు చెబుతున్నారు.ఇదిలా ఉంటే ప్రపంచమంతా కరోనా భయం పట్టుకుంటే ఇప్పుడు బ్రెజిల్ లో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది.


బ్రెజిల్ లోని ఓ కత్రిమ సరస్సులో పుట్టిన `యారా` వైరస్ గురించి అక్కడి ప్రజలు భయపడుతున్నారు.బ్రెజిల్లోని ఓ కత్రిమ సరస్సు నీటిలో నివసిస్తోన్న అమీబాలో ఈ వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

అయితే ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు కనుగొన్న ఇతర వైరస్లకు ఈ వైరస్ కు ఎలాంటి పోలిక లేదు.అందుకే ఈ వైరస్ కు బ్రెజిల్ పురాణంలోని మత్స్యకన్య యారా పేరు పెట్టారు.

ఈ వైరస్లోని 74 జన్యువుల్లో 68 జన్యువులను ఏ ఇతర వైరస్ లలో చూడలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.గ్లోబల్ సైంటిఫిక్ డేటాలోని 8500 రకాల జన్యువులతోనూ ఈ వైరస్ జన్యువులు సరిపోలకపోవడం శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సముద్రజలాల కలుషితం కారణంగా ఇలాంటి కొత్తరకం వైరస్ లు పుట్టుకొస్తున్నాయని తెలిపారు.ప్రస్తుతానికి అమీబాలో కనిపించిన ఈ యారా మనుషుల మీదకి రాలేదు.

ఒకసారి వచ్చినట్లయితే దానిని ప్రభావం ఎలా ఉంటుందో అనేది అంచనా వేయడం కూడా కష్టం అవుతుంది.

తాజా వార్తలు