మన దేశంలో ఎన్నో పవిత్రమైన ఆలయాలు కొలువై ఉన్నాయి.అందులో ఎప్పటికీ ఎవరికీ తెలియని రహస్యాలు, అద్భుతాలు సంతరించుకుని ఉన్నాయి.
ఈ ఆలయాలలో ఉన్న ఈ రహస్యాల గురించి ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినప్పటికీ వాటిని గుర్తించలేకపోయారు.అలాంటి వింతలు దాగి ఉన్న ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి.
అయితే తాజాగా ఇలాంటి ఒక వింత కలిగినటువంటి అతిపురాతన 4 సంవత్సరాల క్రితం ఈ ఆలయం తాజాగా బయటపడింది.అయితే ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ ప్రత్యేకత ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం.బెంగళూరు సిటీకు వాయువ్యంలోని మల్లేశ్వరం లేఅవుట్ లో ఉన్న గంగమ్మ ఆలయానికి అభిముఖంగా ఈ ఆలయం ఉంది.
ఈ ఆలయంలో ఆ పరమేశ్వరుడు దక్షిణదిశగా భక్తులకు దర్శనం ఇవ్వడం వల్ల ఈ ఆలయానికి దక్షిణ ముఖ నందీశ్వరాలయం అనే పేరు వచ్చింది.అదే విధంగా ఈ ఆలయాన్ని నంది తీర్థం అని కూడా పిలుస్తారు.
ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి.ఈ ఆలయానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు ఉంటాయని పురావస్తు శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.
తవ్వకాలలో బయటపడిన ఈ ఆలయం ఎంతో అద్భుతంగా నిర్మించి ఉంది.
ఈ ఆలయంలో పరమేశ్వరుడు దక్షణ దిశగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు.ఈ ఆలయంలో కోనేరులో ఉన్న శివలింగంపై నిత్యం నీటిధార ఏర్పడి ఉంటుంది.ఆ నీటి ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందని అధికారులు ఆరాతీయగా నీటి ప్రవాహం నంది నోటిలో నుంచి ప్రవహిస్తుండడం గుర్తించారు.
ఈ విధంగా నంది నోటి నుంచి నిరంతరం శివలింగం పై జల ప్రవాహం కావడం ఈ ఆలయ విశేషం.అయితే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియడం లేదు.
ఈ నంది నోటి నుంచి వెలువడే నీటి ప్రవాహాన్ని భక్తులు మహా తీర్థ ప్రసాదంగా భావిస్తారు.ఈ నీటి ప్రవాహాన్ని భక్తులు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు లీలలే అని భావిస్తూ, ఈ ఆలయాన్ని సందర్శించడానికి చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం విశేషమని చెప్పవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy