సైన్స్ కే అంతుచిక్కని రహస్యం... దక్షిణ ముఖ నందీశ్వరాలయం..!

మన దేశంలో ఎన్నో పవిత్రమైన ఆలయాలు కొలువై ఉన్నాయి.అందులో ఎప్పటికీ ఎవరికీ తెలియని రహస్యాలు, అద్భుతాలు సంతరించుకుని ఉన్నాయి.

 Scientific Mystery Of Water Flow Of Dakshina Mukha Nandeeshwara Temple ,  Nandee-TeluguStop.com

ఈ ఆలయాలలో ఉన్న ఈ రహస్యాల గురించి ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినప్పటికీ వాటిని గుర్తించలేకపోయారు.అలాంటి వింతలు దాగి ఉన్న ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి.

అయితే తాజాగా ఇలాంటి ఒక వింత కలిగినటువంటి అతిపురాతన 4 సంవత్సరాల క్రితం ఈ ఆలయం తాజాగా బయటపడింది.అయితే ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ ప్రత్యేకత ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం…

బెంగళూరు సిటీకు వాయువ్యంలోని మల్లేశ్వరం లేఅవుట్ లో ఉన్న గంగమ్మ ఆలయానికి అభిముఖంగా ఈ ఆలయం ఉంది.ఈ ఆలయంలో ఆ పరమేశ్వరుడు దక్షిణదిశగా భక్తులకు దర్శనం ఇవ్వడం వల్ల ఈ ఆలయానికి దక్షిణ ముఖ నందీశ్వరాలయం అనే పేరు వచ్చింది.అదే విధంగా ఈ ఆలయాన్ని నంది తీర్థం అని కూడా పిలుస్తారు.

ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి.ఈ ఆలయానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు ఉంటాయని పురావస్తు శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.

తవ్వకాలలో బయటపడిన ఈ ఆలయం ఎంతో అద్భుతంగా నిర్మించి ఉంది.

Telugu Benguluru, Dakshinamukha, Mystery, Nandeeshwara, Nandi Mouth, Parameshwar

ఈ ఆలయంలో పరమేశ్వరుడు దక్షణ దిశగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు.ఈ ఆలయంలో కోనేరులో ఉన్న శివలింగంపై నిత్యం నీటిధార ఏర్పడి ఉంటుంది.ఆ నీటి ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందని అధికారులు ఆరాతీయగా నీటి ప్రవాహం నంది నోటిలో నుంచి ప్రవహిస్తుండడం గుర్తించారు.

ఈ విధంగా నంది నోటి నుంచి నిరంతరం శివలింగం పై జల ప్రవాహం కావడం ఈ ఆలయ విశేషం.అయితే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియడం లేదు.

ఈ నంది నోటి నుంచి వెలువడే నీటి ప్రవాహాన్ని భక్తులు మహా తీర్థ ప్రసాదంగా భావిస్తారు.ఈ నీటి ప్రవాహాన్ని భక్తులు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు లీలలే అని భావిస్తూ, ఈ ఆలయాన్ని సందర్శించడానికి చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం విశేషమని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube