ఈ మూఢ నమ్మకాల వెనకాల ఉండే సైన్స్ మీకు తెలుసా.? అలా చేయడం వెనుక అసలు కారణం ఇదే.!       2018-06-15   00:14:09  IST  Raghu V

మనుషులు పుట్టాక ఆచారాలు, మూఢ నమ్మకాలు మొదలయ్యాయి. ఎందుకు మొదలయ్యాయో, వాటిలో ఎంతవరకు నిజమో, ఆ మూఢనమ్మకాలు,ఆచారాలను పాటించకపోతే ఏదైనా కీడు జరుగుతుందేమోనన్న అపోహ, భయం అందరిలోనూ ఉంది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు వాటిని పాటించడం, నమ్మడం ఒక కారణమైతే, చిన్నప్పటి నుండి మనకు పెద్దవాళ్ళు చెప్పడం, మనం కూడా వాటిని పాటించడం చేస్తున్నాం. అయితే వాటిని ఎందుకు పాటించాలి? ఒకవేళ అలా చేస్తే ఏం జరుగుతుంది అనేదానికి సరైన కారణం మాత్రం ఎవ్వరూ చెప్పరు. కొన్నిటికి మాత్రం సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయిలెండి. మనం పాటించే పద్ధతులు ఒక ప్రాంత ప్రజలు చేయరు. ఇంకొకరు ఎంతో ఇష్టంగా చేసే పనులు మనం ఫాలోకాము. మూఢనమ్మకాల వెనుకున్న రహస్యాలు తెలుసుకుందాం.

ఇంట్లో గొడుగు ఓపెన్ చేస్తే దాని ముందున్న ఐరన్ రాడ్డ్ ఇతరుల కంట్లో కుచ్చుకుంటుందని..ఇంట్లో గొడుగు సడెన్ గా ఓపెన్ చేయడం వలన దానికి దగ్గరలో ఉన్న వస్తువులకు తగలడంతో కిందపడిపోతాయి. అందుకే గొడుగు ఇంట్లో ఓపెన్ చేయవద్దని చెబుతారు. అలా చెబితే పెద్దగా పట్టించుకోరని ఇంట్లో గొడుగు ఓపెన్ చేస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందని ట్యాగ్ లైన్ తగిలించారు.

అలాగే ఇంట్లో పగిలిన అద్దాలను బయటపడేయమని చెబుతారు.అలంటి వాటిలో చూసుకోకూడదని హెచ్చరిస్తారు. దీనికి ఓ కారణం ఉంది. పూర్వం అద్దాలు ఎక్కువ ధరకు అమ్మేవారు. అవి కూడా నాసిరకంగా ఉండేవి. అద్దం చూసుకునేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండటానికి ఇలాంటివి చెప్పేవారట. పగిలితే కొత్తది కొనడం కష్టమని…!