స్కూల్స్ ఓపెన్ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్... మార్గదర్శకాలు జారీ

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు అన్ని కూడా మూతబడిపోయాయి.ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు కరోనా నిబంధనలకి అనుసరించి విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ కి ముందుగానే మూసివేయగా ప్రభుత్వం కూడా ఈ విద్యాసంస్థలు బంద్ ని కొనసాగిస్తూ వచ్చింది.

 Schools Can Be Opened After September 21, Corona Pandemic Situation, Corona Effe-TeluguStop.com

ఇక కరోనా వేళ పరీక్షలు నిర్వహించడం కూడా సరైన నిర్ణయం కాదని పది, ఇంటర్ పరీక్షలు పూర్తిగా రద్దు చేశాయి.కొన్ని రాష్ట్రాలలో ముందుగానే పరీక్షలు నిర్వహించడంతో కొంత సేఫ్ అయ్యారు.

చాలా రాష్ట్రాలలో పరీక్షలు రద్దు చేసి అందరూ ఉత్తీర్ణులు అయినట్లు ప్రకటించారు.కొంత వరకు ఇది విద్యార్ధులకి మంచే చేసిన కూడా ఈ పద్ధతి ఎక్కువ కాలం కొనసాగించడం సరైన పద్ధతి కాదు.

అలాగే విద్యాసంస్థలు ఓపెన్ చేయకుండా కేవలం ఆన్ లైన్ తరగతులకి పరిమితం చేయడం కూడా సరైన విధానం కాదని కేంద్ర ప్రభుత్వం గ్రహించి స్కూల్స్ ఓపెన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే స్కూల్స్ ఓపెన్ చేసిన కూడా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఈ మార్గదర్శకాలు అనునరించే తిరిగి విద్యాసంస్థలు ప్రారంభించాలని ఆదేశించింది. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి స్కూళ్లు రీ ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది.9 నుంచి 12 తరగతుల వారికే స్కూళ్లు తెరవడానికి అనుమతి ఇచ్చింది.టీచర్ల నుంచి గైడెన్స్ కోసం వారు వాలంటరీగా స్కూల్స్‌కు రావొచ్చు.

అయితే, అందుకోసం విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతి తప్పనిసరి.కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉండే స్కూళ్లు మాత్రమే తెరవాలి.

కంటైన్మెంట్ జోన్లలో ఉండే టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది ఎవరూ స్కూల్‌కు రాకూడదు.స్కూల్లో విద్యార్థులు, టీచర్లు వినియోగించే ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి.

ఇప్పటి వరకు క్వారంటైన్ సెంటర్లుగా వినియోగించే స్కూళ్లను మరింత శుభ్రంగా, డీప్ క్లీనింగ్ చేయాలి.స్కూల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 50 శాతానికి మించి రాకూడదు.

అటెండెన్స్ కోసం రిజిస్టర్ హాజరు తీసుకోవాలి.స్కూల్లో క్రీడలు, మార్నింగ్ అసెంబ్లీ లాంటివి నిషేధం.

ప్రతి స్కూల్లోనూ రాష్ట్ర కోవిడ్ 19 హెల్ప్ లైన్ నెంబర్ విధిగా అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి.ఈ నిబంధనలు అనుసరించే స్కూల్స్ పునప్రారంభం చేయాలి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube