సోషల్ మీడియా పరిచయం బాలికతో ఇంత సాహసం చేయించిందా!

సోషల్ మీడియా వల్ల మంచి ఎంత ఉందొ చెడు కూడా అంతే ఉంది.దీనిని ఉపయోగించుకుని మన నాలెడ్జి పెంచుకోవచ్చు.

ఇంత విజ్ఞానాన్ని అందించే సోషల్ మీడియాలో కొంత మంది వల్ల చెడు కూడా ఎదురవుతుంది.వారి స్వార్ధం వల్ల అమాయకులు బలి అవుతారు.

స్నేహితుల ముసుగులో వారు అమాయకుల నుండి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

ఇలాంటి క్రైమ్ లు ఎన్ని జరుగుతున్నా పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్న మోసాలు మాత్రం తగ్గడం లేదు.

తాజాగా ఒక బాలికను మోసం చేసి 750 గ్రాముల బంగారాన్ని తీసుకెళ్లాడు ఒక మోసగాడు.ఆ బాలిక పదవ తరగతి చదువుతుంది.ఈ మధ్యనే ఆ బాలికకు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు.అతడు చెప్పిన బాధలను ఆ బాలిక నమ్మి తన ఇంట్లో ఉన్న బంగారాన్ని మొత్తం ఆ మోసగాడి చేతిలో పెట్టింది.

ఇంట్లో బంగారం అవ్వడంతో ఆ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం లో జరిగింది.అక్కడ నివసించే 15 ఏళ్ల బాలిక పదవ తరగతి చదువుతుంది.

ఆమెకు సోషల్ మీడియాలో శిబిన్ అనే వ్యక్తి ఈ మధ్య పరిచయం అయ్యాడు.కొద్దీ రోజులుగా వీరి స్నేహంగా ఉంటున్నారు.

Telugu Grams Gold, Kerala, School, Steals Gold-Latest News - Telugu

ఇదే అదునుగా ఆ స్నేహం పేరుతొ అతడి ఆర్ధిక కష్టాలు వివరించి బాలికను సహాయం చెయ్యమని కోరాడు.అతని బాధలు విన్న బాలిక తన ఇంట్లో ఉన్న 750 గ్రాముల బంగారాన్ని మొత్తం అతడి చేతిలో పెట్టింది.ఆ బంగారాన్ని అతడు అమ్మేసి 10 లక్షలు దాచి పెట్టుకుని మిగతా వాటితో ఇల్లు బాగుచేయించు కున్నాడు.అయితే ఈ బంగారం లేదని గురించి ఆ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Telugu Grams Gold, Kerala, School, Steals Gold-Latest News - Telugu

పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది.పోలీసుల విచారణలో బాలిక మరొక స్నేహితుడికి కూడా 40 గ్రాముల బంగారం ఇచ్చినట్టు తెలిపింది. దీంతో శిబిన్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.మరొక స్నేహితుడు ఆచూకీ దొరకలేదు.ఇలాంటి ఘటనలు విన్నప్పుడన్న జాగ్రత్త పడాలని తల్లిదండ్రులను పోలీసులు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube