వింటే ఆశ్చర్యపోతారు,13 ఏళ్ల బాలుడి ఘన కార్యం

ఇప్పటివరకు మీరు బైక్ దొంగతనం,కారు, ఇలా కొన్ని వాహనాల చోరీ ల గురించి వినే ఉంటారు.పలనా చోట వారి బైక్ పోయిందట, పలనా చోట పార్క్ చేసిన కారు చోరీ చేశారు అంటూ వార్తలు సహజంగా వింటూ ఉంటాం.

కానీ ఎప్పుడైనా విమానాల దొంగతనం గురించి విన్నారా.ఈ ఘటన చైనా లోని హ్యూజోవు లో చోటుచేసుకుంది.

ఈ నెల 15 వ తారీఖున ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అయితే ఇంతకీ ఈ దొంగతనానికి పాల్పడింది ఏ చేయి తిరిగిన దొంగ కాదు కేవలం ఒక 13 ఏళ్ల బాలుడు కావడం విశేషం.

తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రాంతానికి చెందిన బాలుడు సెక్యూరిటీ గార్డుల కళ్లు గప్పి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు.ఆ తర్వాత హ్యాంగర్‌లో పార్క్ చేసి ఉంచిన ఎయిర్ క్రాఫ్ట్‌ కాక్‌పీట్‌ను తెరిచాడు.

వింటే ఆశ్చర్యపోతారు,13 ఏళ్ల బా

అందులో కుర్చొని విమానాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు.చివరికి విమానం స్టార్టయ్యింది.దీంతో దాన్ని ముందుకు నడిపాడు.రన్‌వేపైకి వెళ్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న గ్రిల్స్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది.దీనితో ఆ విమానాన్ని అక్కడే వదిలేసి మరి ఎయిర్ క్రాఫ్ట్ కాక్ పిట్ ను తెరిచాడు.దాన్ని కూడా అలాగే రన్‌వే పైకి తీసుకెళ్లి చక్కర్లు కొట్టాడు.

దాన్ని గాల్లో టేకాఫ్ (ఎగిరేందుకు) చేసేందుకు ప్రయత్నించాడు.సాధ్యం కాకపోవడంతో దాన్ని కూడా అక్కడే వదిలి వెళ్లిపోయాడు.

అయితే ఆ బాలుడు చేసిన ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.ఐతే అదే రోజు తెల్లవారుజామున ఎయిర్ క్రాఫ్ట్‌ గ్రిల్స్ కు ఢీకొన్న ప్రమాదాన్ని గుర్తించిన విమాశ్రయ సిబ్బంది అసలు ఏమి జరిగింది అన్న కోణం లో సీసీ ఫుటేజీ ని పరిశీలించడం తో ఆ బాలుడి ఘన కార్యం కంటపడింది.

దీనితో ఆశ్చర్యపోయిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం తో పోలీసులు ఆ బాలుడిని,అతడి కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

వింటే ఆశ్చర్యపోతారు,13 ఏళ్ల బా

అయితే దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఆ బాలుడు చేసిన పనికి విమానాశ్రయ సిబ్బంది ఫిదా అయిపోయారు.ఆ బాలుడు ఎలాంటి శిక్షణ లేకుండా ఇలా ఎయిర్ క్రాఫ్ట్ లను నడిపాడు అంటే ఒకవేళ శిక్షణ ఇస్తే గనుక అతడు గొప్ప పైలట్ అవుతాడు అంటూ,అతడికి తగిన శిక్షణ కూడా ఇస్తామంటూ విమానాశ్రయ సిబ్బంది తెలిపింది.మరోపక్క ఈ బాలుడి చర్య కు అతడి తల్లి దండ్రులు చిక్కుల్లో పడ్డారు.

అతడు చేసిన పనికి మరమ్మత్తుల ఖర్చులు,జరిమానా కలిపి మొత్తం 2 వేల యువాన్ లను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube