ఇదెక్కడి దుశ్చర్య.? స్కూల్ లో విద్యార్థినుల బట్టలిప్పించి తనిఖీ చేసారు.! ఎందుకో తెలుస్తే కోపమొస్తుంది.!     2018-11-05   09:31:52  IST  Sai Mallula

పాఠశాలలోని టాయిలెట్‌లో శానిటరీ నాప్‌కిన్ కన్పించడంతో… ఆ శానిటరీ నాప్‌కిన్ ధరించిన విద్యార్థులు ఎవరనే విషయాన్ని తెలుసుకొనేందుకు గాను టీచర్లు విద్యార్థినుల దుస్తులను విప్పారు. ఒక్కొక్కరిని తనిఖీ చేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని ఫిజికా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే..

ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్‌లో మూడు రోజుల క్రితం శానిటరీ నాప్‌కిన్ కన్పించింది. ఈ శానిటరీ నాప్‌కిన్ ను ఎవరు ఉపయోగించారోనని టీచర్లు అడిగారు. అయితే శానిటరీ నాప్‌కిన్ వాడిన విషయాన్ని ఎవరూ కూడా బయటపెట్టలేదు. దీంతో పాఠశాల యాజమాన్యం ఎంతటి దుశ్చర్యకు పాల్పడిందో తెలుసా.?

School Teachers 'Strip' Girls To Check For Sanitary Pads-

School Teachers 'Strip' Girls To Check For Sanitary Pads

పాఠశాల ఆవరణలోనే విద్యార్థినుల బట్టలిప్పేసి మరీ శానిటర్ నాప్‌కిన్ ఎవరు వాడారనే విషయాన్ని కనుక్కొనేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు విద్యార్థినులు ఏడుస్తూ దుస్తులను విప్పేశారు. ఈ విషయమై విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై తల్లితండ్రులు ఆగ్రహం చెంది…యాజమాన్యంపై విమర్శలు చల్లుతున్నారు. ఈ విషయమై విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పాల్పడ్డ ఇద్దరు టీచర్లను బదిలీ చేసారు.