భారీ నగదు బహుమతిని అందుకున్న స్కూలు టీచర్..! ఎందుకంటే..?

తాజాగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చరిత్ర సృష్టించాడు.మహారాష్ట్ర లోని సోలాపూర్ జిల్లాకు చెందిన పరిచే వాడి గ్రామానికి చెందిన రంజిత్‌సిన్హ్ డిసేల్ ఈ చరిత్రకు నాంది పలికాడు.

 Teacher, Award, Huge Winning Amount, Government Teacher, Qr Code Coded Book Laun-TeluguStop.com

బాలికల విద్యా ప్రోత్సాహానికి, క్యూఆర్ కోడ్ కోడెడ్ పుస్తకాల ఆవిష్కరణ విప్లవానికి సంబంధించిన అడుగులు వేయడంతో ఆయన చేసిన పనిని గుర్తించి ఏకంగా ఒక మిలియన్ డాలర్ల వార్షిక గ్లోబల్ టీజర్ ప్రైస్ 2020 కు విజేతగా ఆయన నిలిచారు.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 10 మంది ఫైనలిస్టులతో ఆయన పోటీ పడగా ఈ ఘనతను ఆయన సాధించారు.

అంతేకాదు విజేతగా నిలిచిన తర్వాత ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.తాను గెలుపొందిన ప్రైజ్ మనీని తోటి పోటీదారులతో కలిసి పంచుకుంటానని అని ఆయన తెలిపారు.

ఫైనల్ లిస్టులో తనతోపాటు ఉన్న తొమ్మిది మందితో తనకు వచ్చిన ప్రైస్ మనీలో మొత్తం 50% ప్రైస్ మనీని వారితో పంచుకోబోతున్నట్లు తెలిపారు.దీంతో ఒక్కో ఫైనలిస్టు కు 55 వేల డాలర్లు చొప్పున అందుకోబోతున్నారు.

దీంతో బహుమతి డబ్బులు పంచుకున్న మొట్టమొదటి విజేతగా చరిత్ర సృష్టించారని కొందరు ఆయనను ఉద్దేశించి తెలిపారు.ఈ విషయంతో పంచుకోవడం, ఇవ్వడం లోని ప్రాముఖ్యతను ప్రపంచానికి ఆయన బోధించాలని ఆయన పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Telugu Award, Change, Generalranjit, Teacher, Amount, Qr Coded Launch, Education

ఇకపోతే ఆయన క్లైమేట్ చేంజ్ ను నిలువరించడంలో చేసిన కృషి ధర్మబద్ధమైన,శాంతియుతమైన సమాజాలను నిర్మించాలన్న ఆశతో ముందుకు నడుస్తున్నారని ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ డైరెక్టర్ జనరల్ రంజిత్‌సిన్హ్ డిసేల్ ను ఉద్దేశించి ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈయన లాంటి వారు మన భవిష్యత్తులో రాబోయే తరాలను కాపాడతారని పేర్కొన్నాడు.ఇకపోతే రంజిత్‌సిన్హ్ డిసేల్ కేవలం ప్రయోగాల పై దృష్టి సాధించడమే కాకుండా సామాజిక పనుల్లో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ అందరికీ రోల్ మోడల్ గా నిలుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube