అయ్యయ్యో.. పిల్లలపై కూడా పుష్పరాజ్ మాయ.. అలా దొరికిపోయారేంటి..

పుష్పరాజ్ మ్యానియా దేశం మొత్తం చూపిస్తున్నాడు.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల అయినా విషయం తెలిసిందే.

 School Students Bunk The Classes And Watch Pushpa Details, Allu Arjun,pushpa,pus-TeluguStop.com

ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు.ఈ సినిమా విడుదల అయ్యి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను సాధించింది.

ఇక నిన్నటి వరకు బిగ్ స్క్రీన్ మీద అలరించిన ఈ సినిమా నిన్నటి నుండి స్మాల్ స్క్రీన్ మీద ప్రేక్షకులను అలరిస్తుంది.అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా నిన్నటి నుండి స్ట్రీమింగ్ అయ్యింది.

పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.తెలుగులో మినహా అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అయింది పుష్ప.

బన్నీ తన స్టామినా ఏ లెవల్ లో ఉందో మరొకసారి రుజువు చేసుకున్నాడు.

అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటించి ఫస్ట్ సినిమాతోనే సూపర్ అందుకున్నాడు.

బాలీవుడ్ లో ఇప్పటికే ఈ సినిమా 60 కోట్ల నెట్ వసూలు చేసింది.

Telugu Allu Arjun, Pushpa, Pushpa Mania, Pushpa Dec, Tamilnadu-Movie

ఇక తమిళ్ లో కూడా 20 కోట్ల కు పైగా గ్రాస్ వసూలు చేసింది.తాజాగా ఈ సినిమా పిల్లలపై కూడా ఎంత ప్రభావం చూపించిందో ఈ ఘటన చూస్తేనే అర్ధం అవుతుంది.తమిళనాడులో స్కూల్ విద్యార్థులు పోలీసులకు దొరికి పోయారు.

Telugu Allu Arjun, Pushpa, Pushpa Mania, Pushpa Dec, Tamilnadu-Movie

తమిళనాడులో ఒక థియేటర్ లో సినిమా చూస్తున్న స్కూల్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తమిళనాడు ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్స్ ను నడుపుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే పోలీసులు తనిఖీ చేయడానికి రాగ ఒక థియేటర్ లో స్కూల్ విద్యార్థులు సినిమా చూస్తూ దొరికి పోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసారు.ఈ ఘటనతో పుష్ప సినిమా పిల్లలపై కూడా తన మాయ ఎంత చూపించిందో తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube