అమెరికాలోని బే ఏరియా లో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరహిస్తున్న పాటశాల వసంతోత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి.ఈ వేడుకలు స్థానికంగా ఉన్న సాన్ రామన్ ఐరన్ హార్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించబడ్డాయి.
ఈ వేడుకల కోసం దాదాపు 500 మందికి పైగా అతిధులు పాఠశాల విద్యార్థులు, తల్లితండ్రులు అందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు.సుమారు ఐదు గంటల పాటు ఈ వేడుకలు నిర్వహించ బడ్డాయి.
ఈ వేడుకలని పురస్కరించుకుని పాటలు, పద్యాలు, నాటికలు, నృత్యాలు , తదితర కార్యక్రమాలని తెలుగు దనం ఉట్టిపడేలా ప్రదర్శించారు.ఈ వేడుకలు జరిగిన ప్రాంతాన్నిఎంతో ఆకర్షణీయంగా అలంకరించి , వచ్చిన వారికి తెలుగు భోజనాన్ని వడ్డించారు.
ఈ భోజన ఏర్పాట్లని స్వాగత్ ఇండియన్ కుజిన్ వారు నిర్వహించారు.ఈ వేడుకల్లో తానా-పాఠశాల నిర్వహిస్తున్న తెలుగు పోటీలు కూడా జరపబడ్డాయి.
తానా నిర్వహించిన ఈ పోటీలలో దాదాపు 40 మందికిపైగా పిల్లలు పాల్గొన్నారు.ఇదే పోటీలలో విజేతలు గా గెలుపొందిన చిన్నారులు, వాషింగ్టన్ డీసిలో జులై 4 నుంచి 6 తేదీ వరకూ నిర్వహించబడే తానా మహాసభల ఫైనల్ పోటీలలో పాల్గొంటారు.
విద్యార్ధులకి పరీక్షల నిర్వహణని డా.గీతా వాధవి చేపట్టారు.గెలుపొందిన విజేతలకి సర్టిఫికెట్లను, ట్రోఫీలని బహుకరించారు.