విద్యార్థుల పుస్తకాల బరువు తగ్గించేందుకు ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఏం చేశాడో తెలుసా...? ఇలాగే అందరు చేస్తే ఎంత బాగుండో..!

ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో స్కూల్‌ పిల్లలకు పుస్తకాల మోత చాలా ఎక్కువ.ఇది మేము చెబుతున్న విషయం కాదు, ప్రపంచ విద్యాభివృద్దికి చెందిన ఒక సంస్థ చెప్పిన విషయం.

 School Principal Takes Good Decision For Heavy Weighted School Bags-TeluguStop.com

ఇండియాలో విద్యా విధానం వల్ల స్కూల్‌ పిల్లలు పుస్తకాల మోత బరువును అనుభవిస్తున్నారు.వారు వారి బరువుకు సమానమైన పుస్తకాల బ్యాగ్‌ను మోస్తున్నారు.2వ తరగతి నుండి 10వ తరగతి వరకు పుస్తకాల బరువు పెరిగి పోతూనే ఉంటుంది.అయితే పుస్తకాల బరువు తగ్గించేందుకు పలు నిబంధనలు తీసుకు వచ్చినా కూడా అవి ప్రయోజనం చేకూరలేదు.

కాని గుజరాత్‌కు చెందిన ఒక ప్రిన్సిపల్‌ చేసిన పని వల్ల పిల్లల మోత బరువు సగానికి సగం తగ్గి పోయింది.2006వ సంవత్సరంలో పిల్లల బరువులో పది శాతంను మించి పుస్తకాల బరువు ఉండవద్దని చట్టం తీసుకు వచ్చారు.కాని ఆ చట్టంను పట్టించుకునే నాధుడే లేడు.ప్రభుత్వ పాఠశాల్లోనే ఈ చట్టంను అమలు చేయడం లేదు.ఇక ప్రైవేట్‌ సంగతి సరే సరి.ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో గుజరాత్‌ అహ్మదాబాద్‌, భగద్‌ లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ప్రిన్సిపల్‌ ఆనంద్‌ కుమార్‌ ఖలాస్‌ విభిన్నమైన ఆలోచనతో పిల్లల పుస్తకాల బరువును తగ్గించి వారికి చాలా వరకు స్వేచ్చను ఇచ్చాడు.ఈయన తీసుకున్న వినూత్న నిర్ణయంను మొదట కొందరు తప్పుబట్టినా, ఆ తర్వాత అందరు కూడా
అభినందించారు.

పుస్తకాలను విభజించడం వల్ల ఆనంద్‌ కుమార్‌ పిల్లల బరువు తగ్గించారు.పిల్లల పుస్తకాల సిలబస్‌ను విడదీశారు.నెలల వారిగా సిలబస్‌ను విడదీసి పుస్తకాల పేజీలను తగ్గించాడు.

పేజీలను తగ్గించడం వల్ల పుస్తకాలను మొత్తం క్యారీ చేయాల్సిన అవసరం లేదు.దాంతో పిల్లల బరువు తగ్గించాడు.

తనకు ఈ ఆలోచన కలిగించింది తన కూతురు అని, ఆమె తన పుస్తకాలను బరువు మోయలేక ఇలా చేస్తే బాగుండు అంటూ తనకు సలహా ఇచ్చింది.దాన్ని నేను స్కూల్‌ పిల్లలందరికి అమలు చేశానంటూ ఆనంద్‌ కుమార్‌ పేర్కొన్నాడు.

ఇలాంటి పద్దతినే ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా అమలు చేస్తే బాగుంటుందనేది సదరు అందరి అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube