స్కూల్ గర్ల్ గుర్రపు స్వారీ! తనకి అమ్మాయి ఫోటో కావాలన్న ఆనంద్ మహేంద్రా  

గుర్రపు స్వారీ చేస్తూ పరీక్షలకి వెళ్ళిన అమ్మాయి. సోషల్ మీడియాలో వైరల్. .

School Girl Horse Riding For Going To Exams-going To Exams,school Girl Horse Riding,social Media

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చాలా మందికి స్పూర్తినిస్తూ ఉంటాయి. ఆ వీడియోల ద్వారా అందులో ఉన్నవారు కూడా ఊహించని విధంగా ఫేం సొంతం చేసుకొని సెలబ్రిటీ అయిపోతారు. ఇప్పుడు అలాగే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఏకంగా వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రాని ఆకర్షించింది..

స్కూల్ గర్ల్ గుర్రపు స్వారీ! తనకి అమ్మాయి ఫోటో కావాలన్న ఆనంద్ మహేంద్రా-School Girl Horse Riding For Going To Exams

ఇక అతను ఆమె వీడియోని షేర్ చేయడంతో అది కాస్తా ఒక్కసారిగా వైరల్ అయిపొయింది. ఇప్పటికీ మన దేశంలో బాలికల విద్య ఓ మిథ్య. చాలా చోట్ల ఆడ పిల్లలకు చదువెందుకు అని అనే వాళ్లు ఇంకా ఉన్నారు.

కేరళలో ఈ బాలిక మాత్రం పదో తరగతి పరీక్ష రాయడానికి గుర్రంపై వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది. గర్ల్ పవర్ ఇదీ అంటూ ఆమె గుర్రంపై వెళ్తున్న వీడియోను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియో షేర్ చేస్తూ.

ఆమె నా హీరో అని అన్నారు. ఈ వీడియో గ్లోబల్‌గా వైరల్ కావాలని ఆశించారు.

సదరు బాలిక వివరాలను తనకు ఇవ్వాలని సోషల్ మీడియా యూజర్లను ఆనంద్ మహీంద్రా కోరారు. అలాగే ఆమె ఫోటో షేర్ చేస్తే తన ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకుంటా అని ఆనంద్ మహేంద్రా కామెంట్ చేసారు.