అద్భుతమైన ఆవిష్కరణ: 360 డిగ్రీలలో తిరిగే సీలింగ్ ఫ్యాన్!  

school drop out from Surat designs 360 degrees revolving ceiling fan school dropout, Surat designs, 360 degrees, ceiling fan - Telugu 360 Degrees, Ceiling Fan, School Dropout, Surat Designs

కుటుంబసభ్యులందరూ కలిసి హాల్లో కూర్చుని సరదాగా మాట్లాడుతున్నప్పుడు, లేదా టీవీ చూస్తున్నప్పుడు హాల్లో సీలింగ్ ఫ్యాన్ ఒకటే ఉండడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటివారు ఆల్టర్నేట్ గా కూలర్ లేదా హాల్లో మరొక ఫ్యాను బిగించడం వంటివి చేస్తూ ఉంటారు.

TeluguStop.com - School Drop Out From Surat Designs 360 Degrees Revolving Ceiling Fan

అయితే మీకు ఎప్పుడైనా సీలింగ్ ఫ్యాన్ 360 డిగ్రీలలో తిరిగితే బాగుంటుంది కదా అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అయితే సూరత్ కి చెందిన ఒక వ్యక్తి కి మాత్రం ఈ ఆలోచన వచ్చింది.అయితే తనకు వచ్చిన ఆలోచనలతో నిరంతరం శ్రమించి ఆ ఆలోచనలను అమలు చేసి చూపించాడు.

అయితే అతను ఒక పెద్ద సైంటిస్ట్ లేదా మంచి చదువరి అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.అతను కేవలం ఏడో తరగతి వరకు చదివి, మధ్యలోనే ఆపేశాడు.

TeluguStop.com - అద్భుతమైన ఆవిష్కరణ: 360 డిగ్రీలలో తిరిగే సీలింగ్ ఫ్యాన్-General-Telugu-Telugu Tollywood Photo Image

అతడికి ఎలా సాధ్యం అనుకుంటున్నారా.అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం…

గుజరాత్ లోని సూరత్ జిల్లా, కమ్రేజ్  తాలూకా, ఖోల్వాద్ గ్రామానికి  చెందిన రోహిత్ కరేలియా (45).

తన సొంత ఫ్యాన్ ఫ్యాక్టరీ లో 20 మందికి ఉపాధి కల్పించి, ఫ్యాక్టరీలో ప్రతిరోజూ 10 సీలింగ్ ఫ్యాన్లు, ఐదు టేబుల్ ఫ్యాన్ లను ఉత్పత్తి చేసేవారు.ఇది చాలా కష్టంతో కూడుకున్న పని, అలాగే ఆదాయం కూడా చాలా తక్కువ.

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మూతబడిన తన ఫ్యాక్టరీ, తన ఈ కొత్త ఆలోచనకు పునాది పడింది.లాక్‌డౌన్‌ సమయంలో దాని ఆవిష్కరణకు దోహదపడిందని రోహిత్ తెలిపారు.

అయితే రోహిత్ నూతనంగా ఆవిష్కరించిన రొటేటింగ్ సీలింగ్ ఫ్యాన్ గైరోస్కోప్ సూత్రం ఆధారంగా పని చేస్తుందని, అయితే సాధారణ సీలింగ్ ఫ్యాన్ కున్న మోటార్ ని ఉపయోగించి ఈ రొటేటింగ్ ఫ్యాన్ రూపొందించాడు.అయితే దీనికి దాదాపు 40 వేల వరకు ఖర్చు అయిందని రోహిత్ తెలిపారు.

ఈ అద్భుతమైన ఆవిష్కరణకు పేటెంట్ వచ్చిన వెంటనే ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్ లోకి విడుదల చేస్తామని రోహిత్ చెప్పారు.అయితే ఈ ఫ్యాన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే ఇప్పుడున్న సీలింగ్ ఫ్యాన్లు కనుమరుగై పోతాయి.

రోహిత్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అందుకే ఎక్కువ సమయం కూడా పట్టదని అని తెలుస్తుంది.

#Surat Designs #360 Degrees #School Dropout #Ceiling Fan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

School Drop Out From Surat Designs 360 Degrees Revolving Ceiling Fan Related Telugu News,Photos/Pics,Images..