పాద‌యాత్ర‌కు షెడ్యూల్ ఫిక్స్‌.. వైఎస్సార్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న ష‌ర్మిల‌..

తెలుగు రాష్ట్రా్ల‌లో పాద‌యాత్ర‌ల‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.వైఎస్సార్ హ‌యాం నుంచే ఈ పాద‌యాత్ర‌ల‌కు మ‌రింత క్రేజ్ వ‌చ్చేసింది.

 Schedule Fix For Hiking   Sharmila Following Yssar Sentiment .., Sharmila, Ts Po-TeluguStop.com

ఆయ‌న పాద‌యాత్ర‌తోనే అధికారంలోకి వ‌చ్చేశారు.ఇక రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత కూడా జ‌గ‌న్ ఇదే పాద‌యాత్ర‌తో సీఎం అయ్యారు.

ఇక ఇప్పుడు తెలంగాణ‌లో కూడా బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర‌చేప‌ట్టి ఇమేజ్ పెంచుకుంటున్నారు.ఇక త్వ‌ర‌లోనే కాంగ్రెస్ కూడా పాద‌యాత్ర చేసేందుకు సిద్ధం అవుతోంది.

ఇక తానేం త‌క్కువ కాద‌ని వైఎస్ ష‌ర్మిల కూడా అక్టోబర్ 20 నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్నారు.

తాను తెలంగాణ వ్యాప్తంగా పాద‌యాత్ర చేస్తాన‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించిన ష‌ర్మిల తాజాగా షెడ్యూల్ ఫిక్స్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా తాను చేప‌ట్టిన పాదయాత్రకు ష‌ర్మిల ప్రజాప్రస్థానం పేరును ఫిక్స్ చేసి పెట్టారు.ఇక ఇందులో మ‌రో విష‌యం ఏంటంటే గతంలో త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉమ్మ‌డి రాష్ట్రంలో చేసిన పాదయాత్రకు ప్రజాప్రస్థానం అనే పేరు పెట్టి స‌క్సెస్ అయ్యార‌ని, అందుకే తాను కూడా అదే పేరు పెట్టుకున్న‌ట్టుఉ ష‌ర్మిల వివ‌రించారు.

ఇక ఆమె త‌న తండ్రికి చెందిన మ‌రో సెంటిమెంట్‌ను కూడా ఫాలో అయ్యారు.

Telugu Chevella, Padayatra, Sharmila, Tr Sy, Ts, Ysr, Ysr Telengana-Telugu Polit

త‌న తండ్రి తెలంగాణ‌లోని చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచే పాద‌యాత్ర ప్రారంభించి విజ‌యం సాధించార‌ని, అందుకే తాను కూడా అక్క‌డి నుంచే మొద‌లు పెడుతున్నారు.ఒక్క గ్రేటర్ హైద‌రాబాద్ మినహాయించి, తెలంగాణ‌లోని అన్ని ఉమ్మడి జిల్లాల మీదుగా షర్మిల పాదయాత్ర కొన‌సాగుతుంద‌ని ఆమె వివ‌రించారు.90 నియోజకవర్గాల మీదుగా త‌న యాత్ర ఉంటుంద‌ని, ఆమెనే స్వ‌యంగా విలేకరుల సమావేశంలో తెలిపారు.ఇక ఈ యాత్ర‌లో ప్రజా సమస్యలు తెలుసుకుని వారి త‌ర‌ఫున పోరాడుతానంటూ వివ‌రించారు.చూడాలి మ‌రి ఆమె ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube