మహేష్ 'సర్కారు' సినిమాలో అదే హైలెట్ కాబోతుందా !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెసెంట్ ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది.

 Scenes Between Samuthirakani And Mahesh Babu Highlight For Sarkaru Vaari Paata M-TeluguStop.com

పరశురామ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట షూటింగ్ ప్రెసెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది.మహేష్ ఈ సినిమాలో మరింత యంగ్ గా కనిపించ బోతున్నాడని టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది.
ఈ సినిమాలో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి చూపించ బోతున్నారని తెలుస్తుంది.అంతేకాదు ఆర్ధిక నేరాలకు పాల్పడే అందరిని టార్గెట్ చేస్తూ ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడట.

తాజాగా ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో సముద్రఖని కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Parasuram, Samuthirakani, Sarkaruvaari, Mahe

ప్రస్తుతం హైదరాబాద్ లోని ఉప్పల్ మెట్రో స్టేషన్ లో సముద్రఖని మహేష్ కు మధ్య జరిగే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.అయితే తాజాగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ సముద్రఖని మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.వీరిద్దరూ ఒకరికొకరు సవాల్ చేసుకునే సీన్ ఈ సినిమా కీలక దశలో వస్తుందట.

అందుకే ఈ సినిమాలో వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం.

ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాను 2022 సంక్రాంతి రేస్ లో ఉంచబోతున్నారు.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.మహేష్ ఈ సినిమా పూర్తి అయినా వెంటనే త్రివిక్రమ్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube