సీన్‌ రివర్స్‌ : పెళ్లికి కొన్ని గంటలు ఉండగా లేచి పోయిన వధువు, అయినా ఆగని పెళ్లి లక్‌ అంటే ఇతడిదే  

Scene Reverse At Tamilanadu Marriage-tamilanadu Marriage

మనం సినిమాల్లో ఎక్కువగా తాళి కట్టబోతున్న సమయంలో పెళ్లిలు ఆగిపోవడం చూస్తూ ఉంటాం. అయితే నిజ జీవితంలో కూడా అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వేలల్లో ఒక్కటి అర పెళ్లిలు అలా ఆగిపోతూ ఉంటాయి..

సీన్‌ రివర్స్‌ : పెళ్లికి కొన్ని గంటలు ఉండగా లేచి పోయిన వధువు, అయినా ఆగని పెళ్లి లక్‌ అంటే ఇతడిదే -Scene Reverse At Tamilanadu Marriage

తాజాగా తమిళనాడు సెల్వంలో ఒక పెళ్లిలో వింతైన సంఘటన జరిగింది. పెళ్లి మరి కొన్ని గంటల్లో జరుగనుంది. పెళ్లి పనులు అంతా పూర్తి అయ్యాయి.

బంధు మిత్రులు వస్తున్నారు. ఆ సమయంలోనే పెళ్లి కూతురు లేచిపోయిందని తెలిసింది. చాలా కాలంగా ప్రేమిస్తున్న వ్యక్తితో ఆమె లేచి పోయింది.

వధువు తండ్రి అప్పటికే పెళ్లి కొడుకుకు పాతిక లక్షల వరకు కట్నం ముట్టజెప్పాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వనక్కర్లేకుండా తన తమ్ముడి కూతురును పెళ్లి చేసుకోమని కోరాడు. దాంతో పాటు తనకు ఒకే కూతురు ఉన్న కారణంగా ఆమె లేచి పోయిన కారణంగా ఉన్న ఆస్తిని అంతా నీకే ఇస్తాను. నా తమ్ముడి నుండి కూడా కట్నం వస్తుందని చెప్పాడు.

ఆ అమ్మాయి అభిప్రాయం అడిగి ఆమె ఓకే చెప్పడంతో వెంటనే పెళ్లి జరిగి పోయింది. అనుకున్న సమయంకు పెళ్లి జరిగి పోయింది..

పారిపోయిన అమ్మాయి తండ్రికి దాదాపు అయిదు కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తి అంతా కూడా వరుడికే దక్కనుంది.

దాంతో పాటు ఆయన తమ్ముడికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆయనకు కూడా బాగానే ఆస్తి ఉంది. దాంతో ఆ ఆస్తిలో సగం రానుంది..

పారిపోయిన అమ్మాయి కంటే అందమైన అమ్మాయి భార్యగా లభించడంతో పాటు, డబుల్‌ ఆస్తి కలిసి రావడంతో అతడి ఆనందంకు అవదులు లేకుండా పోయింది. లక్‌ అంటే వీడిదే అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సార్లు ఇలా కూడా జరుగుతుందని సోషల్‌ మీడియాలో ఈ విషయం తెగ వైరల్‌ అవుతోంది.

ఆమె లేచిపోవడం నీ అదృష్టం బ్రదర్‌ అంటూ అతడి లక్‌ను అంతా అభినందిస్తున్నారు.