వైరల్.. పెళ్ళిలో కళ్ళు తిరిగి పడిన వధువు.. పారిపోయిన వరుడు..!

పెళ్లి అంటే మన దేశంలో ఒక గొప్ప వేడుకలా జరుపుకుంటాము.పెళ్లితో ఇద్దరు మనుషులే కాదు రెండు కుటుంబాలు కూడా కలవాలి.

 Scared Groom Runs Away After Bride Falls Unconscious During Sindoor Ceremony-TeluguStop.com

అందుకే కొద్దిగా కూడా తేడా రాకుండా ఎలాంటి గొడవలు లేకుండా చేసుకుంటాము.కానీ అందరి పెళ్లిళ్లు సాఫీగా జరగవు.

ఎవరో ఒకరి నుండి పొరపాటు జరుగుతూనే ఉంటుంది.కొంతమంది చూసి చూడకుండా ఉంటారు.

 Scared Groom Runs Away After Bride Falls Unconscious During Sindoor Ceremony-వైరల్.. పెళ్ళిలో కళ్ళు తిరిగి పడిన వధువు.. పారిపోయిన వరుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి కొంతమంది మాత్రం చిన్న తప్పు కూడా బూతద్దం లో పెట్టి మరి రాద్ధాంతం చేస్తూ ఉంటారు.అలాంటప్పుడు పెళ్లిళ్లు పీటలు వరకు వచ్చి కూడా ఆగి పోతుంటాయి.

పెళ్లి అంటే కొత్త దంపతులు ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు.కొంత మంది మాత్రం పెళ్లి ఇష్టం లేక పీటలు మీద వదిలేసి పారిపోతున్నారు.

తాజాగా ఒక వరుడు కూడా పెళ్లి మండపం నుండి పారిపోయాడు.

పెళ్లి తంతులన్నీ జరుగుతున్నాయి.సరిగ్గా సింధూరం పెడుతున్న సమయంలో పెళ్లి కొడుకు పారిపోయాడు.ఎందుకు అని అనుకుంటున్నారా.ఆగండి.అదే చెప్తున్నా.పెళ్లి కొడుకు వధువుకు సింధూరం పెడుతున్న సమయంలో పెళ్లి కూతురు కళ్ళు తిరిగి పడి పోయింది.అప్పటి వరకు బాగానే ఉన్న వధువు అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

దీంతో పెళ్లి కొడుకు కూడా షాక్ అవ్వడంతో పాటు ఏం జరిగిందో అని హడలి పోయాడు.వెంటనే తేరుకుని మెడలో ఉన్న వరామాలను తీసేసి అక్కడి నుండి పరి పోవడానికి రెడీ అయ్యాడు.అక్కడే ఉన్న ఒక మహిళ వరుడు పారి పోవడం చూసి ఆపాలని గట్టిగ పట్టుకుంది.అయినా కూడా వరుడు ఆగకుండా ఆమెను వెనక్కు తోసేసి పారిపోయాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.పెళ్లి కొడుకుపై నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

#GroomRuns #ScaredGroom #Groom Runs Away

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు