మొబైల్ లో స్కాన్ చేస్తే ఏటీఎం నుంచి డబ్బులు

సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది.ఇప్పుడు ప్రతి పనికి ఏదో ఒక సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి వస్తోంది.

 Scan On Mobile Is Money From Atm1-TeluguStop.com

ఈ విధంగానే… ఏటిఎంలలో నగదు డ్రా చేసుకునేందుకు కొత్త పద్ధతి రానుంది.మొబైల్‌ ఫోన్లలోని యుపిఐ ఫ్లాట్‌ఫాం ద్వారా ఎటిఎంలలో క్యూఆర్‌ కోడ్‌ ని స్కాన్‌ చేసి నగదు పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు ఎజిఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ సంస్థ తెలిపింది.

దీనికి సంబంధించి కొత్త యాప్‌లు డౌన్‌ లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.ప్రస్తుతం ఈ ప్రతిపాదన నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసిఐ) వద్ద ఆమోదం పొందాల్సి ఉందని ఎజిఎస్‌ వెల్లడించింది.అక్కడ ఈ పరిజ్ణానం కనుక ఆమోదం పొందితే ఆ తరువాత ఇది అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube